ఆఫ్ స్క్రీన్ విజయ్ డిఫ‌రెంట్..!

Vijay Deverakonda Is A Different Person When He Is Off Screen Says Bollywood Actress Ananya Panday
Vijay Deverakonda Is A Different Person When He Is Off Screen Says Bollywood Actress Ananya Panday

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఆఫ్ స్క్రీన్ విజయ్ డిఫరెంట్ గా ఉంటాడు అంటుంది అనన్య పాండే. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అన‌న్య పాండే తన సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నందుకు ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. ఇలాంటి అవ‌కాశం ఇచ్చినందుకు పూరీ గారికి, ఛార్మీ గారికి థాంక్స్… హిందీ లోనేకాదు పలు భాషల్లో చేయడానికి నేను రెడీ.. తెలుగులో డైలాగ్స్ నేర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తునాను. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్ రెడ్డి సినిమా చూశాను. త‌ను అద్భుత‌మైన పెర్ఫామ‌ర్‌. కానీ ఆఫ్ స్క్రీన్ డిఫ‌రెంట్‌గా ఉంటాడు… చాలా కూల్‌గా ఉంటాడు.. చెప్పుకొచ్చింది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎప్పుడెప్పుడు ప‌ల‌క‌రిద్దామా అని ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. మరి ఈ సినిమాలో వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 10 =