
హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ తక్కువ టైం లోనే నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. కింగ్ ఆఫ్ హిల్స్ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు. రీసెంట్ గా తరుణ్ భాస్కర్ హీరోను హీరోగా పెట్టి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే సినిమా కూడా నిర్మించాడు. అయితే అది అంత విజయం దక్కించుకోలేకపోయింది. ఇక ఒక పక్క సినిమా నిర్మిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ ల వైపు కూడా విజయ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్స్ అందరూ వెబ్ సిరీస్ లపై దృష్టిని సారిస్తున్నారు. సమంత, ప్రియమణి, నందిని రెడ్డి, క్రిష్ తదితరులు ఇప్పటికే వెబ్ సిరీసుల్లోకి దిగిపోయారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన బ్యానర్‌లో వెబ్ సిరీస్‌లను నిర్మించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘దొరసాని’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన కేవీఆర్ మహేంద్రకు అప్పగించాడని వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చేంత వరకూ ఆగాల్సిందే.




కాగా విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























