ట్యాగ్ · 83 కథనాలు · పేజీ 2
కామెడీ ఎంటర్ టైనర్ "లౌక్యం"
బాబాయ్ , అబ్బాయ్ ల మల్టీ స్టారర్ ?
గుడ్ న్యూస్ చెప్పిన రకుల్ - కరోనా నెగిటివ్
రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
అసలు ఎవరు ఈ జయదేవ్?

"మెర్రీ క్రిస్మస్"-సమంత
కీర్తి సురేష్ క్రిస్మస్ ట్రీ అలంకరణ
రాశీఖన్నా హిందీ వెబ్ సిరీస్

"18 పేజెస్" లో నిఖిల్ ద్విపాత్రాభినయం ?
తేజ్ 'మిస్టికల్ థ్రిల్లర్' గ్రాండ్ లాంచ్
"రాజన్న"మూవీ తమిళ వెర్షన్ రిలీజ్
కోలీవుడ్ లో రాశీఖన్నా బిజీ
రకుల్ కు కరోనా పాజిటివ్
సహజ సుందరి రష్మిక
మహేష్ బాబు కు రామ్ చరణ్ కృతజ్ఞతలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో రామ్ చరణ్ ఇంటికే పరిమితం అయ్యి ఆ విషయాన్ని సోషల్ మీడియా లో అనౌన్స్ చేశారు. తమ అభిమాన హీరోకు కరోనా అని తెలియగానే లక్షలాది మంది అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు. హీరో రామ్ చరణ్ ఆరోగ్యం పై మహేష్ బాబు స్పందించి జాగ్రత్తగా ఉండమనీ, త్వరగా కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నా అనీ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
కామెడీ ఎంటర్ టైనర్ "లౌక్యం"
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీవాస్ దర్శకత్వంలో యాక్షన్ హీరో , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "లౌక్యం " మూవీ ఘనవిజయం సాధించింది. బ్రహ్మానందం , చంద్రమోహన్ , పోసాని, సంపత్ రాజ్, రఘుబాబు , పృథ్వి ముఖ్య పాత్రలలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సూపర్ హిట్ "లౌక్యం " మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకుని ఘనవిజయం సాధించింది.
బాబాయ్ , అబ్బాయ్ ల మల్టీ స్టారర్ ?
సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాబాయ్ (వెంకటేష్ ), అబ్బాయ్ (రానా ) హీరోలుగా ఒక మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కనుందని సమాచారం. హీరో వెంకటేష్ పలు మల్టీ స్టారర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు తో "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , నాగచైతన్య తో "వెంకీ మామ ", వరుణ్ తేజ్ తో "F 3 :ఫన్ &ఫ్రస్టేషన్" మల్టీ స్టారర్ మూవీస్ లో హీరో వెంకటేష్ నటించగా ఆ మూవీస్ ఘనవిజయం సాధించాయి. వెంకటేష్ , వరుణ్ తేజ్ ల "F 3"మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది.
మెగా ఫ్యామిలీ కరోనా దెబ్బ - వరుణ్ కు కరోనా పాజిటివ్
మెగా ఫ్యామిలీకి కరోనా దెబ్బ బాగానే పడినట్టు కనిపిస్తుంది. గతంలో నాగబాబు కరోనా బారిన పడగా కోలుకున్నారు. ఆ తర్వాత చిరు పాజిటివ్ అన్నారు కానీ.. అదృష్టవశాత్తు అది సాంకేతిక లోపం వల్ల పాజిటివ్ అని వచ్చిందని చెప్పడంతో కూల్ అయ్యారు. ఇక ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. ఈ షాక్ నుంచి మెగా అభిమానులు కోలుకోకముందే మరో షాక్ తగిలింది. కొద్దిగంటల వ్యవధిలోనే మరో మెగా హీరో కరోనా బారిన పడినట్టు తెలిపాడు. ఆ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
గుడ్ న్యూస్ చెప్పిన రకుల్ - కరోనా నెగిటివ్
ఒక పక్క కరోనా ప్రభావం తగ్గుతున్నా.. మరోపక్క సెలబ్రిటీస్ మాత్రం కరోనా బారిన పడుతూనే వున్నారు. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా. ఇక ఈ రోజు ఉదయాన్నే రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ అన్న వార్త తెలిసిందే.
రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్
సెలెబ్రిటీస్ ను మాత్రం కరోనా ఇప్పుడప్పుడే వదిలే ప్రసక్తి కనిపించట్లేదు. అసలు ఎలాంటి లక్షణాలు లేని వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ అని చెపుతూ షాకులిస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ మాకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.. అయినా పాజిటివ్ వచ్చింది అని చెప్పిన సంఘటనలు గుర్తుండేవుంటాయి . అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా కరోనా పాజిటివ్ అని చెప్పి షాకిచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
అసలు ఎవరు ఈ జయదేవ్?
గంటా శ్రీనివాస్ రావు తనయుడు గంటా రవి హీరో గా తెలుగు తెరకు పరిచయమైన సినిమా "జయదేవ్". తమిళ్ లో సూపర్ హిట్ అయిన సేతుపతి సినిమాకు రీమేక్ ఇది. జయంత్ C పరాంజీ దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై అశోక్ కుమార్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా 2017 రిలీజై మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

"మెర్రీ క్రిస్మస్"-సమంత
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్స్ , యోగా , గార్డెనింగ్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను సమంత ఇన్ స్పైర్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న "కాతువాకుల రెండు కాదల్ "తమిళ మూవీ లో నయనతార తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
కీర్తి సురేష్ క్రిస్మస్ ట్రీ అలంకరణ
తెలుగు , తమిళ , మలయాళ భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ప్రస్తుతం నితిన్ "రంగ్ దే !", రజనీకాంత్ "అన్నాత్తే ", మోహన్ లాల్ "మరక్కార్ " మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ లో కీర్తి కథానాయికగా ఎంపిక అయ్యారు.
రాశీఖన్నా హిందీ వెబ్ సిరీస్
బ్లాక్ బస్టర్ "మద్రాస్ కేఫ్ " (2013 ) హిందీ మూవీ తో రాశీఖన్నా కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుస లాడే " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఇమైక్క నోడిగళ్ " మూవీ తో రాశీఖన్నా కోలీవుడ్ లో అడుగు పెట్టి పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. రాశీఖన్నా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

"18 పేజెస్" లో నిఖిల్ ద్విపాత్రాభినయం ?
సక్సెస్ ఫుల్ "అర్జున్ సురవరం "మూవీ తరువాత యంగ్ హీరో నిఖిల్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరో నిఖిల్ ప్రస్తుతం "18 పేజెస్ " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18 పేజెస్ " మూవీ రూపొందుతుంది. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
తేజ్ 'మిస్టికల్ థ్రిల్లర్' గ్రాండ్ లాంచ్
రొటీన్ గా ఒకే జోనర్ లో సినిమాలు చేస్తే వర్క్ అవుట్ కాదని మన హీరోలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. అందుకే హీరోలు కూడా కొత్త కొత్త జోనర్ లు చేయడానికి ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగానే యంగ్ హీరో సాయి తేజ్ కూడా కొత్త జోనర్.. కొత్త కథతో వస్తున్నాడు.
'సోనూసూద్' కు విగ్రహం ఏర్పాటు
ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ సోనూసూద్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు.. కర్ణుడిలాగా సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చడం దగ్గర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు. కొంతమంది అయితే ఆయన్ని దేవుడితో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
"రాజన్న"మూవీ తమిళ వెర్షన్ రిలీజ్
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో నాగార్జున అక్కినేని హీరోగా రూపొందిన ఎమోషనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా "రాజన్న "మూవీ 2011 సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీ రిలీజ్ అయ్యి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. స్నేహ , బేబీ అన్నీ ముఖ్య పాత్రలలో నటించారు. బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకున్న "రాజన్న"మూవీ కి కీరవాణి సంగీతం అందించారు. కీరవాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
కోలీవుడ్ లో రాశీఖన్నా బిజీ
ట్రెడిషినల్ , మోడరన్ డ్రెస్ లతో ఫోటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పలు సూపర్ హిట్ తెలుగు మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా కోలీవుడ్ కు ఎంటర్ అయ్యి పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. "తుగ్లక్ దర్బార్ ", "అరణ్మణై 3", "మేధావి ", "సైతాన్ కా బచ్చా"తమిళ మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రకుల్ కు కరోనా పాజిటివ్
ఒక పక్క కరోనా ప్రభావం తగ్గుతున్నా.. మరోపక్క సెలబ్రిటీస్ మాత్రం కరోనా బారిన పడుతూనే వున్నారు. నిజం చెప్పాలంటే సామాన్య ప్రజలకంటే సెలెబ్రిటీసే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే కరోనాకు గురవుతున్న సెలబ్రిటీస్ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్పా.. తగ్గట్లేదు. ఇప్పటికే ఎంతోమంది ఈ కరోనా వైరస్ బారిన పడి కోలుకోగా.. మరికొంత మంది మృతి చెందారు కూడా.
'చిరంజీవి' గారు కొట్టలేనన్నారు.. విలన్ పాత్రలు ఇక చేయను
కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను... కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగానిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకవైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో విడుదల…
బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ కు చిరు ప్రామిసెస్
అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ 4 సీజన్ కంటెస్టెంట్స్ కు మాత్రం బాగానే కలిసొచ్చింది అని చెప్పొచ్చు. విన్నర్ అయినా అభిజిత్ తో పాటు పలువురు కంటెస్టెంట్స్ కు కూడా బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున.. అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పలువురు కంటెస్టెంట్స్ కు స్పెషల్ ప్రామిస్ లు చేసి వావ్ అనిపించుకున్నారు.
సహజ సుందరి రష్మిక
తెలుగు , కన్నడ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రష్మిక తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న క్రైమ్ థ్రిల్లర్ "పుష్ప" మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "సుల్తాన్ "మూవీ తో రష్మిక కోలీవుడ్ లో ప్రవేశిస్తున్నారు. తెలుగు , కన్నడ , తమిళ భాషల పలు మూవీ ఆఫర్స్ ను రష్మిక అందుకుంటున్నారు.

బిగ్ బాస్ 4 - విన్నర్ అభి'జీత్'
బిగ్ బాస్ 4 - మొత్తానికి ఇన్ని రోజులు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సీజన్ 4 ముగిసింది. దాదాపు 106 రోజులపాటు బుల్లితెర ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ను కలిగించింది. ఇక నిన్న గ్రాండ్ ఫినాలే జరుపుకున్న బిగ్ బాస్ లో ఏం జరిగిందో తెలియాలంటే ఎపిసోడ్ లోకి వెళ్లాల్సిందే.