ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ సోనూసూద్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు.. కర్ణుడిలాగా సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చడం దగ్గర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు. కొంతమంది అయితే ఆయన్ని దేవుడితో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సోనూ సూద్ చేసిన సాయానికి గాను ఇప్పుడు ఆయనకు ఆలయం కూడా కట్టేసారు. తాజాగా తెలంగాణ సిద్దిపేట జిల్లాలోని దుబ్బతండాలోని రాజేశ్ రాథోడ్, గిరిజనులు కలిసి సోనూకు ఆలయం నిర్మించి పూజలు సైతం చేస్తున్నారు.ప్రస్తుతం దుబ్బతండాలోని సోనూసూద్ ఆలయం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక దీనిపై సోనూసూద్ కూడా స్పందిస్తూ.. తాను ఇలాంటి వాటికి అర్హుడిని కానంటూ.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
Don’t deserve this sir.
Humbled🙏 https://t.co/tX5zEbBwbP— sonu sood (@SonuSood) December 21, 2020
కాగా ప్రస్తుతం ఆచార్య సినిమాలో సోనూసూద్ నటిస్తున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అల్లుడు అదుర్స్’ సినిమా తెరకెక్కుతుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభానటేశ్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా… సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు… గొర్రెల సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: