టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. వర్కౌట్స్ , యోగా , గార్డెనింగ్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను సమంత ఇన్ స్పైర్ చేస్తున్నారు. సమంత ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న “కాతువాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నయనతార తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



క్రిస్మస్ పండగ సెలబ్రేషన్స్ కు సమంత 10 రోజులు ముందుగానే తన ఇంటిని డెకరేట్ చేశారు. ఇంటి ముందు క్రిస్మస్ ట్రీ ని ఏర్పాటు చేశారు . క్రిస్మస్ రోజున సమంత , నాగచైతన్య , ఫ్రెండ్స్ తో పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. 2021సంవత్సరం మీకు , మీ కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం , సంతోషం తో ఉండాలని కోరుకుంటున్నా అంటూ క్రిస్మస్ ట్రీ ముందు కలర్ ఫుల్ డ్రెస్ లో ఉన్న తన ఫోటోను సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసి తన అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























