కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను… కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగానిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒకవైపు పూర్తి చేసుకుంటూ.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది మే లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో సోను సూద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నటించే సందర్భంలో జరిగిన విషయాలపై చెపుతూ పలు ఆసక్తికరవ్యాఖ్యలు చేసాడు. యాక్షన్ సీన్లలో చిరంజీవి సోనూసూద్‌ను కొట్టేందుకు ఇబ్బందిపడ్డారట. ప్రజల మనస్సుల్లో గొప్ప మనిషిగా స్థానం సంపాదించుకున్న నిన్ను యాక్షన్ సన్నివేశాల్లో కొట్టాలంటే ఇబ్బందిగా ఉంది. నిన్ను కొడితే ప్రజలు ఇష్టపడరు’ అని చిరంజీవి అన్నారట. ఇప్పుడు హీరోగా నాకు అవకాశాలు వస్తున్నాయి. నాలుగు కథలు విన్నాను. ఇకమీదట విలన్ పాత్రలు చేయాలనుకోవడం లేదు అని క్లారిటీ ఇచ్చాడు.
ఇక కరోనా వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితుల్లో ఎంతో మంది ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరిస్థితుల్లో చేతికి వెన్నెముక లేనట్టు సాయం చేసాడు సోనూ సూద్. కార్మికులని సొంతింటికి చేర్చడం దగ్గర నుండి తనను సాయం అడిగిన వాళ్లకు కూడా సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక ఆయన చేసిన సేవలకు సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా ప్రశంసలు కురిపించారు.
ఈ కరోనా వల్ల హీరో అయిన విలన్ ఎవరంటే సోనూసూదే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























