మెగా ఫ్యామిలీకి కరోనా దెబ్బ బాగానే పడినట్టు కనిపిస్తుంది. గతంలో నాగబాబు కరోనా బారిన పడగా కోలుకున్నారు. ఆ తర్వాత చిరు పాజిటివ్ అన్నారు కానీ.. అదృష్టవశాత్తు అది సాంకేతిక లోపం వల్ల పాజిటివ్ అని వచ్చిందని చెప్పడంతో కూల్ అయ్యారు. ఇక ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. ఈ షాక్ నుంచి మెగా అభిమానులు కోలుకోకముందే మరో షాక్ తగిలింది. కొద్దిగంటల వ్యవధిలోనే మరో మెగా హీరో కరోనా బారిన పడినట్టు తెలిపాడు. ఆ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని..తనలో కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించగా టెస్ట్ చేయించగా కరోనా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంటూ అన్ని జాగ్రత్తలను పాటిస్తున్నానని తెలిపాడు. త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటానని మీ ప్రేమకు ధన్యవాదాలు అని ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) December 29, 2020
మరి ఇటీవలే నిహారిక పెళ్లి జరిగింది… అంతేకాక క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా మెగా, అల్లు ఫ్యామిలీస్ కలిసి జరుపుకున్నాయి.. ఇప్పుడు చరణ్ కు వరుణ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది… మిగిలిన వారు టెస్ట్ లు చేయించుకుంటే కానీ ఇంత ఎంత మంది లిస్ట్ లో వుంటారో తెలుస్తుంది.
కాగా ప్రస్తుతం వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఈ సినిమా కోసం ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























