బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ కు చిరు ప్రామిసెస్ 

Bigg Boss 4 Finale, Bigg Boss 4 Finale Chiranjeevi, Bigg Boss 4 Finale Contestants, Bigg Boss 4 Finale Highlights, Bigg Boss 4 Finale Nagarjuna, Bigg Boss 4 Winner Abhijeet, Bigg Boss Telugu Season 4, Chiranjeevi Offers Divi Vadthya A Role In His Movie, Divi Vadthya, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Offers Divi Vadthya A Role, Megastar Chiranjeevi Offers Divi Vadthya A Role In His Movie, meher ramesh, Telugu Filmnagar, tollywood updates

అన్ని సీజన్స్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ 4 సీజన్ కంటెస్టెంట్స్ కు మాత్రం బాగానే కలిసొచ్చింది అని చెప్పొచ్చు. విన్నర్ అయినా అభిజిత్ తో పాటు పలువురు కంటెస్టెంట్స్ కు కూడా బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా హోస్ట్ నాగార్జున.. అతిధిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి పలువురు కంటెస్టెంట్స్ కు స్పెషల్ ప్రామిస్ లు చేసి వావ్ అనిపించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అతిథిగా వచ్చిన చిరు ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి మాట్లాడుతూ…మొదట సోహెల్ తో మాట్లాడిన చిరుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. సింగ‌రేణి ముద్దు బిడ్డ‌.. క‌థ వేరుంట‌ది.. ఈ డైలాగ్‌ని నా త‌దుపరి సినిమాల‌లో పెట్టుకుంటాన‌ని చిరు అన‌డంతో సోహైల్ ఎమోషనల్ అయ్యాడు. మ‌ట‌న్‌ని బాగా ఇష్ట‌ప‌డే సోహైల్ కోసం చిరు త‌న ఇంట్లో మ‌ట‌న్ బిర్యాని స్వ‌యంగా చేయించి పంపించారు. దీనితో సోహెల్ కంటతడి పెట్టుకున్నాడు. నా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రావాలి స‌ర్ అంటే గెస్ట్ కాదు.. నీ సినిమాలో ఒక క్యామియో కూడా ఇవ్వమని అంటాడు. ఇస్తే  సోహైల్ సినిమాలో చిరు అతిథి పాత్ర పోషిస్తాన‌ని మాటఇవ్వడంతో ఆనందంలో మునిగిపోయాడు.

ఇక మరో కంటెస్టెంట్ దివికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు చిరు. చిరు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో దివికి మంచి రోల్ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆరు నెలల తర్వాత కలుద్దాం అని కూడా చెప్పాడు.

ఇక మెహ‌బూబ్ గురించి మాట్లాడిన చిరంజీవి.. నిన్ను చూస్తుంటే చిన్న‌ప్పుడు నన్ను నేను చూసుకున్న‌ట్లుంది. సినిమాలోకి రావ‌డానికి ఎంత త‌ప‌న చెందానో అది నీలో క‌నిపిస్తుంది అని చిరు అన్నారు. ఇక సోహైల్ త‌న‌కు వ‌చ్చిన రూ. 25 ల‌క్ష‌ల‌లో ఒక రూ. 5ల‌క్ష‌లు మెహ‌బూబ్‌కి ఇస్తానంటే వ‌ద్దని చెప్పి వాటిని అనాథశ్ర‌మానికి ఇచ్చేయాలి అన్నాడు అని నాగార్జున అన‌డంతో చిరు మ‌న‌సు క‌రిగిపోయి వెంట‌నే ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల చెక్‌ని మెహ‌బూబ్‌కి అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.