షారుఖ్ ఖాన్ జవాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.వరుసగా నాలుగో రోజు కూడా 100కోట్లకు పైగా రాబట్టి బాలీవుడ్ లో కొత్త రికార్డు ను క్రీయేట్ చేసింది.మూడు రోజు హిందీ సినిమా చరిత్రలోనే అత్యధికంగా 144.22కోట్లు రాబట్టిన ఈసినిమా ఆదివారం మరో 136.17 కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది. దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 520.79కోట్ల గ్రాస్ వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో 500కోట్ల క్లబ్ లో చేరిన మొదటి హిందీ సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.ఇందులో షేర్ 252కోట్లు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే తెలుగు,తమిళ వెర్షన్ లు కూడా సూపర్ వసూళ్లను దక్కించుకుంటున్నాయి.తెలుగులో నాలుగు రోజుల్లో జవాన్ 33కోట్ల గ్రాస్ ను రాబట్టగా తమిళంలో 27కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఓవరాల్ గా ఫుల్ రన్ లో జవాన్ 1000కోట్ల మార్క్ ను అందుకోనుంది.దాంతో వరుసగా రెండోసారి1000 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి బాలీవుడ్ హీరోగా షారుఖ్ రికార్డు సృష్టించనున్నాడు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాను కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























