కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 291

lokesh kanagaraj direct rajinikanth 171movie
సినిమా వార్తలు

లోకేష్ డైరెక్షన్ లో రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ మూవీ ఫిక్స్ అయ్యింది. గత కొన్ని రోజులుగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీ నటించనున్నాడని వార్తలు వచ్చిన తెలిసిందే. ఇక ఆవార్తలను నిజం చేస్తూ మేకర్స్ ఈరోజు అధికారికంగా ప్రకటించారు.రజినీ 171 సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేయనుండగా అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.అన్బు- అరివ్ ఫైట్స్ కంపోజ్ చేయనున్నారు.సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించనుంది.

Mahender Reddyవాట్సాప్
anand deverakonda first look out from Gam Gam Ganesha movie
ఫస్ట్ లుక్

గం గం గణేశా- ఆనంద్ దేవరకొండ ఫస్ట్ లుక్ రిలీజ్

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అయితే తన అన్న మార్కుతో కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు రావాలని మొదటినుండీ ఆ దిశగానే సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. మొదటిసినిమానే దొరిసాని అంటూ నటనకు స్కోప్ ఉన్న సినిమాను ఎంచుకొని మొదటిసినిమాతోనే మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. ఆతరువాత మిడిల్ క్లాస్ మెలోడిస్ తో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఆతరువాత వచ్చిన హైవే, పుష్పకవిమానం నిరాశపరిచినా..రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. తన నటనతో నటుడిగా ఈసినిమాతో మరో మెట్టుఎక్కాడు ఆనంద్ దేవరకొండ.

TFN Adminవాట్సాప్
peddha kapu 1 movie trailer released
ట్రైలర్ & టీజర్

పెదకాపు-1 ట్రైలర్ రిలీజ్

కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. దానికి నిదర్శనమే రీసెంట్ గా బలగం సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అదే కంటెంట్ బెేస్డ్ తో వస్తున్న సినిమా పెదకాపు. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను తీసి మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన రూటు మార్చాడు. వెంకీతో నారప్ప సినిమాను తీసి హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు పెదకాపు అంటూ వచ్చేస్తున్నాడు. విరాట్ కర్ణ హీరోగా వస్తున్న ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ ఈనెల 29వ తేదీన రిలీజ్ కాబోతుంది.

TFN Adminవాట్సాప్
samyuktha menon first look released from devil movie
ఫస్ట్ లుక్

డెవిల్- సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కు ఎప్పుడు గోల్డెన్ లెగ్ అనే పేరు వస్తుందో చెప్పడం కష్టం. కానీ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఇప్పటికే గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకొని ప్రస్తుతం వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటుంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుసగా హిట్లను తన ఖాతాలో వేసుకుంది. దీంతో లక్కీ హీరోయిన్ గా పేరుతెచ్చుకొని కెరీర్లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Chiranjeevi, Vasishta's Mega 157 Movie Pre Production Work Begins
సినిమా వార్తలు

మెగా 157 ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘మెగా 157’ వర్కింగ్‌ టైటిల్‌తో ఒక కొత్త చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు చిత్ర దర్శకుడు వశిష్ట సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. అందులో.. " ‘మెగా 157’ ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలైంది. త్వరలోనే మీ అందరినీ సరికొత్త అనుభూతినిచ్చే సినిమాటిక్‌ అడ్వెంచర్‌కు తీసుకెళ్లేందుకు మేము సిద్ధం" అని వశిష్ట పేర్కొన్నారు. ఈ సందర్భంగా వశిష్ట ‘మెగా 157’ టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్‌ చే శారు. కాగా ఈ సినిమా సోషియో ఫాంటసీగా రూపొందనుంది.

Srikanth Mవాట్సాప్
bichagadu movie re release date fixed
రిలీజ్ అప్‌డేట్

రీ రిలీజ్ కు సిద్దమైన ఎమోషనల్ బ్లాక్ బస్టర్

విజయ్ ఆంటోని సినిమాలు కాస్త వైవిధ్యంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే కదా. నిజానికి విజయ్ ఆంటోని క్రేజ్ గురించి చెప్పాలంటే బిచ్చగాడు ముందు..బిచ్చగాడు తరువాత అని చెప్పొచ్చు. బిచ్చగాడు సినిమాలు విజయ్ ఆంటోని సినీ కెరీర్ నే మార్చేసింది. తల్లి సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆసినిమాతో కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా అభిమానులను సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గానే ఈసినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Akshay Kumar Unveils Teaser of Welcome To The Jungle on His Birthday
ట్రైలర్ & టీజర్

అక్షయ్‌ కుమార్‌ బర్త్ డే.. వెల్‌కమ్‌ టు ది జంగిల్‌ అనౌన్స్‌మెంట్‌

బాలీవుడ్‌లో 2007లో వచ్చిన 'వెల్‌కమ్‌' సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ ఏడాది రిలీజైన హిందీ సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్స్‌ తెచ్చిపెట్టిన సినిమాగా ఇది నిలిచింది. దర్శకుడు అనీజ్‌ బజ్మీ తనదైన కామెడీ టైమింగ్‌తో ఈ సినిమాను ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి గ్రాండ్ సక్సెస్ కొట్టాడు. అనంతరం ఆయన 2015లో దీనికి కొనసాగింపుగా 'వెలకమ్‌ బ్యాక్‌' సినిమాను రూపొందించాడు. అయితే అనీజ్‌ ఈసారి కథకు కామెడీతో పాటు కొంచెం మోతాదులో యాక్షన్‌ టచ్‌ అప్‌ ఇచ్చి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా వర్కవుట్ అయ్యి సినిమా కమర్షియల్‌గా భారీ విజయం సాధించింది.

Srikanth Mవాట్సాప్
update on brahmastra part 2 and 3 working progress
సినిమా వార్తలు

బ్రహ్మాస్త్ర2, 3 ఆన్ ప్రోగ్రెస్

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. భారీ బడ్జెట్ తో విభిన్నమైన కథతో విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈసినిమా గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా మంచి హిట్ ను సాధించింది. అస్త్రావర్స్ అనే కాన్సెప్ట్ అస్త్రాలకు సంబంధించి హిస్టరీని చూపించారు. ఇక ఈసినిమా వచ్చి ఏడాది అయిపోయింది. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఈనేపథ్యంలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చివరిలో బ్రహ్మాస్త్ర 2, 3పార్ట్ లకు సంబంధించిన అప్ డేట్ కూడా ఇచ్చారు. బ్రహ్మాస్త్ర 2…

TFN Adminవాట్సాప్
gopichand and sreenu vaitla new movie grand launch
సినిమా వార్తలు

గోపీచంద్-శ్రీను వైట్ల మూవీ ప్రారంభం

టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ భీమా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కన్నడ దర్శకుడు ఎ హర్షశ్రీ దర్శకత్వంలో అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది ఈసినిమా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. కాగా ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
peddhakapu1 movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

పెదకాపు1 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్లతో అలరించాడు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నారప్ప సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే ధోరణి మారింది కాబట్టి శ్రీకాంత్ కూడా తన పంథాను మార్చి మాస్ పై పోకస్ పెట్టాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా పెదకాపు1. రెండు భాగాలుగా ఈసినిమా రాబోతుంది. అందులో మొదటి భాగం రాబోతుంది. ఇక ఊర్లలో ఉండే ఆదిపత్య పోరు నేపథ్యంలో ఈసినిమాా రాబోతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Sittharala Sithravathi full song released from Aadikeshava movie
సాంగ్

ఆదికేశవ నుండి సిత్తరాల సిత్రావతి ఫుల్ సాంగ్ రిలీజ్

మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం మరో కొత్త సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆదికేశవ. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమాలో ఫుల్ మాస్ పాత్రలో నటించనున్నట్టు ఇప్పటికే రిలీజ్ అయిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. నిజానికి ఈసినిమాను ఈనెల 18న విడుదల చేయాలని అనుకున్నారు కానీ షూటింగ్ పూర్తి కాకపోయేసరికి వాయిదా వేశారు. సెప్టెంబర్ 10వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Miss Shetty Mr Polishetty Gets Over A Half Million Dollars Collections in USA
బాక్సాఫీస్

యూఎస్‌లో డాలర్ల వర్షం కురిపిస్తోన్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి

'జాతిరత్నాలు' ఫేమ్ నవీన్ పొలిశెట్టి, ప్రముఖ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మించారు. పి మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాధాన్, గోపీ సుందర్ మ్యూజిక్ అందించారు. ఇక సీనియర్ నటి జయసుధ, అభినవ్ గోమటం, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తిలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే పాజిటివ్‌ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతోంది. ఫన్ ఫామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలైన…

Srikanth Mవాట్సాప్
shah rukh khan sweet reply to mahesh babu tweet
సినిమా వార్తలు

మహేష్ ట్వీట్ కు షారుఖ్ స్వీట్ రిప్లై

ఫైనల్లీ షారుఖ్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఎదురుచూసిన జవాన్ సినిమా అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అట్లీ దర్శకత్వంలో ముఖ్యంగా షారుఖ్ హీరో కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో మొదటి షో నుండీ మంచి టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ల లిస్ట్ లో చేరిపోయింది. అంతేకాదు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతున్నాడు షారుఖ్. రెండురోజుల్లోనే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకొని కొత్తరికార్డులు క్రియేట్ చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Balagam Nominated For International Sound And Film Music Festival
సినిమా వార్తలు

మరో ఇంటర్నేషనల్ అవార్డుకు నామినేట్ అయిన బ‌ల‌గం

టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు వారసులైన హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌, శిరీష్‌ సమర్పణలో నిర్మించిన సినిమా బలగం. వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కింది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో దాదాపు అందరూ కొత్త నటులే నటించడం విశేషం. మార్చి 3వ తేదీన చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బలగం సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
venkatesh saindhav movie shooting update
షూటింగ్ అప్‌డేట్

విదేశాల్లో సైంధవ్ టీమ్

టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం వెంకీ నుండి తెలుగులో వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్, అలానే విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంకా ఆండ్రియా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Chandramukhi 2 gets a new release date
రిలీజ్ అప్‌డేట్

చంద్రముఖి 2 విడుదల కూడా వాయిదా

ఈనెల 15న విడుదలకావాల్సిన సినిమాలు ఒక్కొక్కటి గా వాయిదాపడుతున్నాయి.అందులో భాగంగా టిల్లు స్క్వేర్ అలాగే స్కంద ఇదే డేట్ కూడా విడుదలకావల్సి ఉండగా వెనక్కి వెళ్లిపోయాయి.స్కంద ఈనెల 28న వస్తుండగా టిల్లు స్క్వేర్ నవంబర్ కు వెళ్ళిపోయింది.ఇక ఇప్పుడు ఈజాబితాలో మరో సినిమా చేరిపోయింది.అదే చంద్రముఖి 2.ఈసినిమాకూడా 15న విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడి ఈనెల 28న రిలీజ్ అవుతుంది.అనుకున్న సమయానికి సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమా ఆలస్యంగా విడుదలవుతుందని మేకర్స్ తెలిపారు.ఈసందర్భంగా న్యూ రిలీజ్ డేట్ తో కూడిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
jawan day 1 collections
బాక్సాఫీస్

జవాన్ తొలి రోజే 100కోట్లు

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను తెచ్చుకుంది.దాంతో ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ తో సెన్సేషన్ సృష్టించింది.మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.హిందీ సినిమా చరిత్రలోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.ఇక తొలిరోజే 100కోట్ల వసూళ్లను రాబట్టడం షారుఖ్ కు ఇది రెండో సారి.ఇంతకుముందు షారుక్ నటించిన పఠాన్ కూడా తొలిరోజే 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
SS Rajamouli Reviews Miss Shetty & Mr Polishetty and Jawan
సినిమా వార్తలు

ఆ రెండు సినిమాలపై రాజమౌళి రివ్యూ.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం రాజమౌళి పేరుని చెప్పగానే గుర్తుపడతారంటేనే.. అర్ధమవుతోంది ఆయన ఎంత ఫేమస్ అయ్యారో. 'ఆర్ఆర్ఆర్' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ట్రెజర్ హంట్, ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా దీనిని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు ఆయన. అయితే తాజాగా రాజమౌళి ఇటీవలే విడుదలైన రెండు సినిమాలను వీక్షించారు. అంతేకాకుండా.. ఆ రెండు…

Srikanth Mవాట్సాప్
chandramukhi 2 movie pre release event date and venue locked
సినిమా వార్తలు

చంద్రముఖి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్‌లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్‌కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసారి రాఘవ లారెన్స్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు.

TFN Adminవాట్సాప్
Mark Antony Movie Completed All Censor Formalities
సినిమా వార్తలు

మార్క్ ఆంటోనీ సెన్సార్ కంప్లీట్.. రన్‌టైమ్‌ ఎంతంటే?

కోలీవుడ్ హీరో విశాల్‌కి అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై ఇక్కడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో విశాల్ తాజాగా నటిస్తోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'మార్క్ ఆంటోనీ'. విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో విశాల్ సరసన రీతూవర్మ హీరోయిన్ గా చేస్తోంది. జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.

Srikanth Mవాట్సాప్

షేర్