ఏదైనా సినిమా నచ్చితే దానిపై స్పందించడానికి ఏమాత్రం వెనుకాడరు సూపర్ స్టార్ మహేష్ బాబు. తమ ట్విట్టర్ ద్వారా నచ్చిన సినిమాలను ప్రశంసిస్తూనే ఉంటారు. ఇక ఇప్పుడు మరో సినిమా మహేష్ ప్రశంసలను అందుకుంది. పి. మహేష్ బాబు దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ బాగా నచ్చింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్ కలెక్షన్స్ అందిస్తుంది. యూఎస్ లో అయితే ఇప్పటికే 1మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా న చూసిన మహేష్ తాజాగా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ అని.. ఫ్యామిలీతో కలిసి చాలా ఎంజాయ్ చేశా.. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ ఆన్ స్పాట్.. అనుష్క ఎప్పటిలాగే బ్రిలియంట్ గా పెర్ఫామ్ చేసింది..ఈసినిమా మంచి సక్సెస్ అందుకున్నందుకు చిత్రయూనిట్ అందరికీ కంగ్రాట్స్ అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
#MissShettyMrPolishetty… A complete laugh riot… Thoroughly enjoyed it with the family… @NaveenPolishety is spot-on with his comic timing, and @MsAnushkaShetty was brilliant as always. Congratulations to @filmymahesh, @UV_Creations and the entire team on its success!! 👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) September 9, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: