సరికొత్త రికార్డు సృష్టించిన పుష్ప 2

Allu Arjun's Pushpa 2 Movie Hits The Fastest 100K Interests on Bookmyshow

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని జాతీయస్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పుష్పరాజ్ గా ఆయన చూపిన అద్భుత నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నాడు. తాజాగా ఆయన పుష్ప 2: ది రూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్పకి సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం ఒక సరికొత్త రికార్డ్ సృష్టించింది. బుక్‌ మై షోలో వేగంగా 100K ఇంటరెస్ట్ రేట్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మేరకు హీరో అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా విడుదల తేదీ ప్రకటించకపోవడం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ, డాలీ ధనంజయ్, రావు రమేష్ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సీనియర్ నటుడు జగపతి బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

కాగా సెకండ్ పార్ట్‌ కోసం దేశవ్యాప్తంగా పుష్ప ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, పోస్టర్స్ మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ రికార్డులు క్రియేట్ చేసింది. చిత్తూరులో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గంగమ్మ జాతరలో అమ్మవారిని పోలిన లుక్ లో వున్న బన్నీ పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక మొదటి పార్ట్‌తో ఎన్నో సంచలనాలు సృష్టించిన పుష్ప రాజ్.. సెకండ్ పార్ట్‌తో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eleven =