పుష్ప2 బిగ్ అనౌన్స్ మెంట్- రిలీజ్ డేట్ ఫిక్స్

pushpa 2 movie release date fixed

సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పుష్ప2 సినిమా కూాడా ఒకటి. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో బన్నీ మాస్ లుక్, తన నటన తో పాట కథ, పాటలు అన్నీ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. ఇక ఈసినిమా ఇక్కడ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనాలు సృష్టించడంతో నార్త్ లో కూడా అల్లు అర్జున్ ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. అందుకే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అందరూ ఈసినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుది. ఈమధ్య ఈసినిమా నుండి అల్లు అర్జున్ బర్త్ డేకి ఫస్ట్ లుక్ ను అలానే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వాటికి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈసినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది. మరోవైపు చాలా రోజుల నుండి కొత్త అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు తాజాగా ఈసినిమా నుండి బిగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమాను వచ్చే ఏడాది ఆగష్ట్ 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మరి పుష్పరాజ్ మేనియా చూడాలంటే దాదాపు ఏడాది వరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − six =