కోలీవుడ్ హీరో విశాల్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ సినిమా ‘మార్క్ ఆంటోనీ’. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విశాల్‌తో పాటు ప్రముఖ దర్శక, నటుడు SJ సూర్య మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాలో విశాల్ సరసన ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా చేస్తుండగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదలకి సంబంధించి ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే అంతకుముందు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు చెల్లించాల్సిన రూ.21.29 కోట్లలో రూ.15 కోట్లు చెల్లించడంలో విశాల్ విఫలమైన నేపథ్యంలో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సినిమా విడుదలను నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ వివాదాన్ని విశాల్ పరిష్కరించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెన్నై కోర్టులో ఈ సినిమాపై వేసిన కేసులో కోర్ట్ స్టేని వెకేట్ చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ముందుగా నిర్ణయించిన మేరకు సెప్టెంబర్ 15నే ఈ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు హీరో విశాల్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు.
No objection in court to release the movie #MarkAntony, Stay vacated.#MarkAntony all set to release on Sep 15th Worldwide and 22nd in Hindi, GB#MarkAntonyFromSep15#WorldOfMarkAntony pic.twitter.com/4eXj0Og7Y8
— Vishal (@VishalKOfficial) September 12, 2023
ఇక ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. అలాగే మూవీ టోటల్ రన్‌టైమ్ 150 నిమిషాలు కలిగి ఉంది. కాగా తాజాగా విడుదలైన ట్రైలర్‌ను గమనిస్తే.. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ జానర్ లో తీసినట్లు అనిపిస్తోంది. ఇంకా విశాల్ డ్యూయెల్ రోల్స్ ప్లే చేసినట్లు అర్ధమవుతోంది. ఇక ఇంతకుముందు విడుదల చేసిన మోషన్ పోస్టర్, కొన్ని నిమిషాల్లోనే 5 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేయగా.. తాజాగా రిలీజైన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
సైన్స్, ఫిక్షన్ అంశాలను మేళవించి రూపొందించిన ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో 7/G బృందావన కాలనీ దర్శకుడు సెల్వ రాఘవన్, టాలీవుడ్ కమెడియన్ సునీల్ ప్రత్యేక పాత్రల్లో నటిస్తుండటం విశేషం. అలాగే రీతూ, అభినయ, కింగ్స్లీ, యంజి మహేంద్రన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే సునీల్ ఈ చిత్రంలో ఇప్పటివరకు తన కెరీర్‌లో చేయనటువంటి డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కాగా మినీ స్టూడియో బ్యానర్‌పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న తమిళం మరియు తెలుగు భాషలలో రిలీజ్ చేయనుండగా.. సెప్టెంబర్ 22న హిందీలో కూడా విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.