బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి తాను బాలీవుడ్ బాద్ షా అని నిరూపించాడు. లాక్ డౌన్ తరువాత పూర్తిగా ఢీలా పడిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీకి పఠాన్ అంటూ వచ్చి ప్రాణం పోశాడు. ఆ తరువాత పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇక ఇప్పుడు మరోసారి జవాన్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించాడు. అట్లీ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా జవాన్. వీరిద్దరి కాంబినేషన్ పై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమా ఉండటంతో ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కలెక్షన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫస్ట్ డేనే 100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఐదు రోజుల్లో 500 కోట్లకు పైగా గ్రాస్ ను అలానే 300 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి నేటితో వారం రోజులు అయింది. వారం రోజుల్లో ఈసినిమా 660 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. ప్రస్తుతం సినిమాలు ఏం లేకపోవడం కూడా ఈసినిమాకు బాగా కలిస్తొంది. వీకెండ్ లో ఈ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు ఇలానే కలెక్షన్స్ వస్తే 1000 కోట్ల క్లబ్ లో చేరడం కష్టమేం కాదంటున్నారు సినీ విశ్లేషకులు.
A storm called Jawan has taken over the world!🔥
Book your tickets now: https://t.co/B5xelUahHO
Watch #Jawan in cinemas – in Hindi, Tamil & Telugu. pic.twitter.com/K5J7XuMHRI
— Red Chillies Entertainment (@RedChilliesEnt) September 14, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: