రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

Rakshit Shetty's Saptha Sagaralu Dhaati Movie Release Date Locked

ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టి పేరు చెప్తే తెలుగు ప్రేక్షకులు ఠక్కున గుర్తుపట్టకపోవచ్చు. అయితే ‘777చార్లీ’ సినిమా హీరో అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. ఆ సినిమాతో తెలుగులో ఓవర్‌నైట్‌ పాపులర్ అయ్యాడు రక్షిత్‌ శెట్టి. అంతకుముందు ‘అతడే శ్రీమన్నారాయణ’ అనే పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన కన్నడ చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ’ సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో రక్షిత్‌ సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. లవ్ స్టోరీ నేపథ్యం కలిగి ఉండటంతో యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం. దీంతో ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రాన్ని ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగులో విడుదల చేయనుంది. ఈ క్రమంలో ఈరోజు సినిమా విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాను సెప్టెంబర్ 22న విడుదల చేస్తున్నట్లు సదరు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కాగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ రెండు భాగాలుగా రూపొందింది. తొలిభాగం సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రాగా.. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల కానుంది. గుండు శెట్టి ఈ సినిమాకు సహ రచయితగా వ్యవహరించగా.. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం అందించారు. ఇక ఈ సినిమాను హీరో రక్షిత్‌ శెట్టి తన స్వంత బ్యానర్‌పై నిర్మించడం విశేషం.

సినిమా కథ ఏంటంటే..?

క్లుప్తంగా చెప్పుకోవాలంటే.. మధ్య తరగతికి చెందిన ఇద్దరు వ్యక్తుల కథే ఇది. పెళ్లి చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కనే ఓ జంట జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను ఇందులో హృద్యంగా చూపించారు. కథానాయకుడు మను (రక్షిత్‌ శెట్టి), హీరోయిన్ ప్రియ (రుక్మిణి వసంత్)లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుని బీచ్ పక్కన ఒక అందమైన ఇల్లు కట్టుకుని హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే ఈ క్రమంలో ఒక సమయంలో వీరు తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం వలన జీవితం తల్లకిందులు అవుతుంది. ఒక దశలో మను జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. అసలు మను జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఆ తర్వాత ఏం జరిగింది? జైలు నుంచి మను మళ్ళీ బయటకు రాగలిగాడా? లేదా? ఈ నేపథ్యంలో వారికి ఎదురైన సమస్యలేంటి? అనే కథాంశంతో ‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ’ సినిమా తెరకెక్కింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.



Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here