ఈమధ్య తన రూట్ ను మార్చి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా డెవిల్. పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా ఎంత సైలెంట్ మొదలుపెట్టారో అంతే సైలెంట్ గా కంప్లీట్ చేశారు. అయితే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో ఒక్కసారిగా సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా డబ్బింగ్ పనులను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ప్రస్తుతం ఆదిశగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గానే సంయుక్త మీనన్ పుట్టిన రోజు సందర్భంగా ఈసినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ ను నిలిపారు. నవంబర్ 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే నేడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. మాయే చేసే అనే మొదటిపాటను సెప్టెంబర్ 19వ తేదీన సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రేపు అంటే సెప్టెంబర్ 15వ తేదీన ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈపాటకు సత్య ఆర్.వి లిరిక్స్ అందించారు.
Are you as excited as we are for #DevilMusical?😍#Devil First Single #MaayeChesey will enchant you with soulful vocals of @sidsriram, beautifully penned lyrics by #SatyaRV, mesmerising music of @rameemusic & amazing performances of @NANDAMURIKALYAN & @iamsamyuktha_ ❤️
Lyrical… pic.twitter.com/00jVx6adG4
— ABHISHEK PICTURES (@AbhishekPicture) September 14, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు హిందీ తమిళం మరియు కన్నడ భాషలలో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: