ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే కదా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్ హీరోగా వస్తున్న సినిమా మ్యాడ్. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతున్నట్టు ఇప్పటికే వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమైపోయింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది ఈసినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టి ఇప్పటికే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రౌడ్ సే సింగిల్ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రెండు రోజుల క్రితం ప్రోమోను రిలీజ్ చేయగా.. తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. క్యాచీ లిరిక్స్ తో ఉన్న ఈ పాట అయితే ఆకట్టుకుంటుంది. నాకాష్ అజీజ్, భీమ్స్ ఆలపించగా రఘురాం లిరిక్స్ అందించారు.
కాగా సంగీత్ శోభన్,రామ్ నితిన్ కీలక పాత్రల్లో నటించగా..గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ సోదరి సూర్యదేవర హారిక ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: