టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న ‘దేవర’ సినిమా షూటింగ్‌కు స్మాల్ బ్రేక్ ఇచ్చారు. తన కుటుంబంతో కలిసి ఆయన విదేశీ పర్యటనకు బయలుదేరారు. కాగా ఆయన దుబాయ్ పర్యటనకు వెళ్తున్నట్లు తెలిసింది. సైమా అవార్డ్స్ ఈవెంట్‌కి హాజరయ్యేందుకు జూనియర్ దుబాయ్‌కి బయలుదేరినట్లు సమాచారం. ఈ క్రమంలో గురువారం ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. జూ. ఎన్టీఆర్ ఇలా సడన్‌గా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లడం ఫ్యాన్స్ కి కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే తారక్ దుబాయ్ వెళ్ళడానికి బలమైన కారణమే ఉంది. అదేంటంటే..?
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్ వేదికగా సైమా 2023 అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) వేడుకలు జరుగనున్నాయి. దీనిలో భాగంగా ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 11 విభాగాల్లో నామినేట్ అయ్యింది. అలాగే బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ పోటీపడుతోన్నారు. అలాగే బ్లాక్ బస్టర్ మూవీస్ ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’, ‘కాంతారా’ సినిమాలు కూడా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. వీటితో పాటు టాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘సీతారామం’ 10 కేటగిరీల్లో నామినేషన్స్ పొందింది. దీంతో ఈ అవార్డుల వేడుకకు తారక్ సహా ప్రముఖ కన్నడ హీరోలు యష్, రిషభ్ శెట్టి, మృణాల్ ఠాకూర్, శ్రీలీల తదితరులు కూడా హాజరవనున్నారు.
మరోవైపు తారక్ నిన్నటివరకూ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాలో కీలకమైన యాక్షన్ ఘట్టాల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ సినిమాలో జూనియర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నాడు. కాగా ఇటీవలే జూ. ఎన్టీఆర్‌పై బాలీవుడ్ దర్శకుడు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీడియోల్ హీరోగా ఇటీవలే విడుదలైన ‘గదర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ఆ చిత్ర దర్శకుడు అనిల్ శర్మ ఒక ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను ఆకాశానికెత్తేశాడు. జూ.ఎన్టీఆర్ అయితే తారాసింగ్ పాత్రకు న్యాయం చేయగలడని, ఆ ఐకానిక్ క్యారెక్టర్‌ని ఆయన అద్భుతంగా పోషించగలడని పేర్కొన్నారు. దీంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: