ఉదయ్ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఇప్పటివరకూ లవర్ బాయ్ గా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లతో అలరించిన ఆనంద్ దేవరకొండ ఇప్పుడు యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. అయితే ఈసినిమా కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ లాగ అనిపిస్తుంది. ఇక ఈసినిమా ఎంత సైలెంట్ గా షూటింగ్ ను పూర్తిచేసుకుందో అంతే ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా జోరుగా చేస్తుంది. దీనిలో భాగంగానే వరుస అప్ డేట్లను ఇస్తున్నారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ ను అలానే మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారో లేదో అప్పుడే టీజర్ అప్ డేట్ తో వచ్చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. ఈ చెడు ప్రపంచంలో మంచిగా బ్రతకాలనుకోవడం ఒక చెడ్డ ఆలోచన అంటూ మొదలవుతుంది టీజర్. ఇక టీజర్ ను బట్టి సినిమా మొత్తంకామెడీగా నడుస్తుందని తెలుస్తుంది. అమ్మాయిని టీజ్ చేస్తే నవ్వు రావాలి కానీ కళ్లలో నీళ్లు రాకూడదు అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ బాగుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: