విశాల్,ఎస్ జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మార్క్ అంటోనీ.ప్రమోషన్స్ లో భాగంగా విడుదలైన ట్రైలర్,ఈసినిమా ఫై ఆసక్తిని తీసుకొచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ లో ఎస్ జె సూర్య డైలాగ్స్ సినిమాపై హైప్ ను క్రీయేట్ చేశాయి.ఇక ఈసినిమా ఈరోజే థియేటర్లోకి వచ్చింది.ఈసినిమాకు రివ్యూస్ పాజిటివ్ గా వస్తుండడమే కాదు మౌత్ టాక్ కూడా అలాగే వుంది.దాంతో కోలీవుడ్ లో ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకునేలా వుంది.తమిళంతోపాటు తెలుగులోకూడా విడుదలకాగా తెలుగులో డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టైం ట్రావెలింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో ఎస్ జె సూర్య నటన హైలైట్ అయ్యిందట.డైలాగ్స్ ,యాక్టింగ్ తో అదరగొట్టాడని టాక్ అలాగే విశాల్ కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యాడట.అంతేకాదు సిల్క్ స్మిత రిఫరెన్స్ సీన్ థియేటర్లలో బాగా పేలడంతో పాటు సెకండ్ హాఫ్ లో కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యిందట.ఇక గత కొంత కాలంగా హిట్ కొట్టలేకపోయిన విశాల్ ఈ మార్క్ అంటోనీ సక్సెస్ తో ఎట్టకేలకు మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.
అద్విక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో టాలీవుడ్ యాక్టర్స్ సునీల్,రీతూ వర్మ కీలక పాత్రల్లో నటించారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా ఎస్ వినోద్ కుమార్ నిర్మించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























