హీరోలు తమ వృత్తి రీత్యా సినిమాలు చేస్తుంటారు. సినిమాలు అంటే ఇష్టం, ప్యాషన్ ఉండి కొంతమంది హీరోలుగా మారుతుంటారు.. కొంతమంది వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే వారికి కూడా పర్సనల్ లైఫ్ లో కొన్ని ఇష్టాలుంటాయి. ఈనేపథ్యంలోనే నాగచైతన్యకు బైక్స్ ఇంకా రేస్ లంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే ఇప్పుడు స్పోర్ట్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మోటర్ రేసింగ్ టీమ్‌కు ఓనర్‌గా మారాడు నాగ చైతన్య.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగచైతన్య ఇటీవలే ప్రముఖ మోటార్‌స్పోర్ట్ రేసింగ్ టీమ్, హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ ఓనర్ షిప్ ని పొందిన సంగతి తెలిసిందే కదా. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తనదైన ముద్ర వేసిన ఈ జట్టు ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభ సీజన్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.. మోటార్‌స్పోర్ట్‌లో భాగం కావాలని ఎప్పుడునుంచో చూస్తున్నాను. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీమ్‌లో భాగమైనందుకు చాలా అనందంగా వుంది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఇండియన్ మోటార్‌స్పోర్ట్‌లో గొప్ప వినోదాన్ని అందిస్తుంది. అలాగే యువ ప్రతిభావంతులకు వేదికగా నిలిచింది. ఈ సీజన్‌లో స్ట్రీట్ రేసుల కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది గొప్ప అనుభవంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అన్ని వయసుల వారికి మోటార్‌స్పోర్ట్ పట్ల అవగాహన పెరుగుతుండటంతో, దానిలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం. ఇది జరిగేలా చేసిన చేసిన మిస్టర్ అఖిల్‌కి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అంటూ తెలిపారు.
అక్కినేని వారసత్వం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగచైతన్య. రీసెంట్ గానే కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ హీరో నాగ చైతన్య. ఈసినిమా సరైన విజయాన్ని అయితే అందించలేకపోయింది. ప్రస్తుతం నాగ చైతన్య చందూ మొండేటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. యదార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. మత్స్యకారుడు గణగల్ల రామరావు జీవితాన్ని ఈసినిమా ద్వారా చూపిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: