టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ‘800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. కాగా ‘800’ ఆలిండియా పంపిణీ హక్కులను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళంలో రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమాకి సంబంధించి మూవీ టీమ్ కీలక అప్డేట్ ఇచ్చింది. అక్టోబర్ 6న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఆ రోజున 800 చిత్రాన్ని దేశవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన నెట్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న మురళీధరన్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గత కొన్నిరోజుల క్రితం ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
#MuthiahMuralidaran‘s #800TheMovie releasing WW on 6th October.@Murali_800 @GhibranVaibodha @Mahima_Nambiar @RDRajasekar @Cinemainmygenes @VivekRangachari @dirpitchumani @sampathdft @MovieTrainMP @krishnasivalenk @SrideviMovieOff @sonymusicsouth @PulagamOfficial pic.twitter.com/f7JMFcjL39
— Movie Updates (@Movieupdates69) September 14, 2023
ఈ కార్యక్రమానికి శ్రీలంక మాజీ క్రికెట్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ సనత్ జయసూర్య కూడా హాజరయ్యారు. కాగా ఇటు సచిన్ ఇండియా తరఫున, అటు మురళీధరన్ శ్రీలంక తరఫున ఎన్నో మ్యాచ్‌ల్లో తలపడిన విషయం తెలిసిందే. అయితే మైదానంలో పోటీ పడినప్పటికీ… మైదానం వెలుపల ఇరువురికీ మంచి స్నేహం ఉంది. దీంతో మురళీధరన్ కోసం ‘800’ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సచిన్ వచ్చారు.
ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించగా.. బుకర్ ప్రైజ్ (2022) పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. కాగా ఈ సినిమాలో మధుర్ మిట్టల్, మహిమా నంబియార్ మెయిన్ లీడ్స్ లో నటిస్తుండగా.. నరెన్, నాజర్, వేల్ రామమూర్తి, రిత్విక, వడివుక్కరసి, అరుల్ దాస్, హరి కృష్ణన్, శరత్ లోహితశ్వ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ కాగా, ఆర్.డి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ, జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: