సినీ ప్రియులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 వేడుకలకు సర్వం సిద్ధం అయింది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఈరోజు, రేపు (సెప్టెంబర్ 15, 16) ఈ అవార్డుల కార్యక్రమం జరుగనుంది. ఇక ఈవెంట్లో భాగంగా దుబాయ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయగా.. అందులో పలువురు తారలు పాల్గొని సందడి చేశారు. వీరిలో టాలీవుడ్ యాక్టర్లు రానా, ప్రణీత, శ్రీలీల, మంచు లక్ష్మీప్రసన్న మరియు తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. మరోవైపు సైమా అవార్డ్స్ ఈవెంట్‌కి హాజరయ్యేందుకు టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురువారమే దుబాయ్‌కి చేరుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 11 విభాగాల్లో నామినేట్ అయ్యింది. బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ పోటీపడుతున్నారు. అలాగే బ్లాక్ బస్టర్ మూవీస్ ‘కేజీఎఫ్ – చాప్టర్ 2’, ‘కాంతారా’ సినిమాలు కూడా 11 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా నటించిన టాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘సీతారామం’ 10 కేటగిరీల్లో నామినేషన్స్ పొందింది. దీంతో ఈ అవార్డుల వేడుకకు తారక్ సహా ప్రముఖ కన్నడ హీరోలు యష్, రిషభ్ శెట్టి, మృణాల్ ఠాకూర్ తదితరులు కూడా హాజరవనున్నారు.
ఇక ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) నటీ,నటులు మరియు ఇతర టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందజేస్తుంటారన్న విషయం తెలిసిందే. గతేడాది బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో ‘పుష్ప: ది రైజ్’ 6 కేటగిరీస్ లో అవార్డ్స్ గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. బెస్ట్ యాక్టర్ – అల్లు అర్జున్, బెస్ట్ డైరెక్టర్ – సుకుమార్, బెస్ట్ మ్యూజిక్ – దేవి శ్రీ ప్రసాద్, బెస్ట్ లిరిసిస్ట్ – చంద్రబోస్, బెస్ట్ సపోర్టింగ్ రోల్ – జగదీష్, బెస్ట్ తెలుగు మూవీ వంటి కేటగీరీల్లో పుష్ప పురస్కారాలను సొంతం చేసుకుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: