గం గం గణేశా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

anand deverakonda gam gam ganesha movie teaser release date locked

రీసెంట్ గా బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇక అలా వచ్చిందో లేదో అప్పుడే మరోసినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసినిమా షూట్ ను చాలా సైలెంట్ గా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక మరోవైపు ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఈసారి విజయ్ డిఫరెంట్ కథతో రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇప్పుడు మరో సర్ ప్రైజిగ్ అప్ డేట్ తో వచ్చేశాడు. టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను రేపు అంటే సెప్టెంబర్ 15వ తేదీన సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో ఇంకా ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హై లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =