కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 268

ambajipeta marriage band movie gumma song out now
సాంగ్

అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు- గుమ్మ సాంగ్ రిలీజ్

విభిన్నమైన సినిమాలు ఎంచుకుంటూ మంచి హిట్లను అందుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుహాస్. ఈసారి కూడా అలాంటి కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాతోనే వచ్చేస్తున్నాడు. దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈమధ్యే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
Japan Trailer Launch Event Suriya and Karthi Selfie Video with Fans Goes Viral
ట్రైలర్ & టీజర్

జపాన్‌ ట్రైలర్‌ లాంఛింగ్‌ ఈవెంట్‌.. సూర్య, కార్తీ సెల్ఫీ వీడియో, నెట్టింట వైరల్

తెలుగులో స్టార్ హీరోల రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న ప్రముఖ తమిళ హీరోలు సూర్య, కార్తీ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ అన్నదమ్ములే అన్న విషయం తెలిసిందే. కెరీర్ ప్రారంభం నుంచీ వీరు తమిళంతో పాటు తెలుగులోనూ తమ సినిమాలను రిలీజ్‌ చేయడంతో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. దీంతో వీరి సినిమాల‌కు ఇక్కడ టైర్ 2 హీరోల స్థాయిలో మంచి కలెక్షన్‌లు వస్తుంటాయి. ముఖ్యంగా హీరో కార్తీ అయితే తన సినిమా ప్రమోషన్స్ సమయంలో కార్తి తెలుగులో స్పష్టంగా మాట్లాడటం, అలాగే సినిమాల్లోని తన పాత్రలకు తానే సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడంతో టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.

Srikanth Mవాట్సాప్
santosh soban new movie withe baby movie team
సినిమా వార్తలు

బేబి టీమ్ తో సంతోష్ శోభన్- ఇంటెన్స్ గా ప్రీ లుక్

యంగ్ హీరో సంతోష్ శోభన్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు. గోల్కొండ హైస్కూల్ సినిమాలో ఒక పాత్రలో నటించి ఇండస్ట్రీలోకి సంతోష్ శోభన్. ఆతరువాత తను నేను, పేపర్ బాయ్, ఏక్ మిని కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ సబ్ స్క్రైబ్, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

TFN Adminవాట్సాప్
balakrishna bhagavanth kesari movie 11 days collections
బాక్సాఫీస్

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ 11 డేస్ కలెక్షన్స్

వరుస హిట్లతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో మరో హిట్ ను అందుకొని మరోసారి తన సత్తాను చాటాడు. ఇదే సినిమాతో బాలకృష్ణ కూడా హ్యాట్రిక్ ను అందుకున్నాడు. ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో ఈసినిమా రాగా బాలకృష్ణను అనిల్ కొత్త గా చూపించిన విధానం అందరికీ నచ్చింది. అంతేకాకుండా బాలకృష్ణ-శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు.. యాక్షన్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.

TFN Adminవాట్సాప్
Hi Nanna movie third single Ammaadi song release date fixed
సాంగ్

హాయ్ నాన్న- అమ్మాడి సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా హాయ్ నాన్న. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. దసరా సినిమ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇక రీసెంట్ గా ఈసినిమా నుండి టీజర్ చేయగా టీజర్ అయితే సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Brahmanandam Funny Speech at Keedaa Cola Pre-release Event
సినిమా వార్తలు

అలా అడగాలంటే.. నా ఇగో అడ్డొస్తుంది - బ్రహ్మానందం ఇంట్రెస్టింగ్ కామెంట్స్

‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్‌ దాస్యం నుంచి వస్తున్న మూడవ చిత్రం ‘కీడా కోలా’. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య రావు, రవీంద్ర విజయ్‌, హరికాంత్, రఘురామ్‌ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా.. ఆదివారం (డిసెంబర్ 29, 2023) హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని…

Srikanth Mవాట్సాప్
Manchu Vishnu Injured During Kannappa Shooting
షూటింగ్ అప్‌డేట్

కన్నప్ప షూటింగ్ లో ప్రమాదం- గాయపడ్డ విష్ణు

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచువిష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి కూడా తెలిసిందే. న్యూజిలాండ్ లో ఈసినిమాలోని కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షూటింగ్ లో భాగంగా ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్స్‌ సీక్వెన్సులను డ్రోన్‌ సాయంతో షూట్‌ చేస్తున్నారట. ఈ క్రమంలోనే డ్రోన్‌ అదుపు తప్పి నేరుగా వచ్చి మంచు విష్ణు మీద పడిందట. దీంతో మంచు విష్ణుకు స్వల్ప గాయాలయ్యాయట. దీంతో…

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Announces His Movie with Director Tharun Bhascker
సినిమా వార్తలు

పెళ్లిచూపులు కాంబో రిపీట్.. త్వరలో తరుణ్ భాస్కర్‌తో విజయ్ దేవరకొండ సినిమా

'పెళ్లి చూపులు' కాంబో రిపీట్ కాబోతోంది. టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మరియు ట్యాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ కలయికలో త్వరలో కొత్త సినిమా రూపొందనుంది. ఈ మేరకు హీరో విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరైన 'కీడా కోలా' చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో భాగంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కాగా 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' వంటి హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్‌ దాస్యం నుంచి వస్తున్న మూడవ చిత్రం 'కీడా కోలా'. క్రైం కామెడీ నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్‌ హాస్య నటుడు బ్రహ్మానందం ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. త‌రుణ్ భాస్కర్‌, చైత‌న్య…

Srikanth Mవాట్సాప్
jigarthanda double x movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ వచ్చేసిన జిగర్ తండ డబల్ ఎక్స్ రిలీజ్ డేట్

తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సిద్దార్థ్, బాబి సింహా ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమాకు తెలుగులో రీమేక్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సీక్వెల్ లో లారెన్స్ హీరోగా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

TFN Adminవాట్సాప్
Japan Karthi movie trailer out now
ట్రైలర్ & టీజర్

జపాన్ ట్రైలర్ రిలీజ్

చేసే ప్రతి పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోవాలని ఆ దిశగానే పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు కార్తీ. తాను అనుకున్నట్టే జరుగుతుంది కూాడా. తెలుగులో వచ్చిన ఊపిరి, ఖాకి, విరుమాన్, ఖైదీ, సర్దార్ రీసెంట్ గా వచ్చిన పొన్నియన్ సెల్వన్ 1, 2 లో తన పాత్రలు గుర్తుండిపోతాయి. ఇక ఇప్పుడు జపాన్ అంటూ మరో డిఫరెంట్ మేకోవర్ తో బాడీ లాంగ్వేజ్ తో వస్తున్నాడు. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా ఈసినిమా వస్తుంది.

TFN Adminవాట్సాప్
Humma Humma Song Is Out From Ooru Peru Bhairavakona Movie
సాంగ్

ఊరు పేరు భైరవకోన- పెప్పీ మెలోడీ హమ్మా హమ్మా సాంగ్ రిలీజ్

ట్యాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న సినిమా ఊరు పేరు భైరవకోన. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఫాంటసీ అడ్వెంచర్ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వెళుతున్నారు.

TFN Adminవాట్సాప్
Varun Tej-Lavanya Tripathi Wedding Allu Arjun Left For Italy with His Family
సినిమా వార్తలు

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం.. ఫ్యామిలీతో కలిసి ఇటలీకి అల్లు అర్జున్

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి షురూ అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరియు నటి లావణ్య త్రిపాఠిల వివాహం మరో మూడు రోజుల్లో జరుగనుంది. నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌ గ్రాండ్‌గా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాజరవనున్నారు. దీనిలో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీసమేతంగా ఇటలీకి పయనమవగా.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కుటుంబంతో సహా ఇటలీకి బయలుదేరారు. ఈ క్రమంలో తన సతీమణి స్నేహారెడ్డి మరియు పిల్లలతో కలిసి ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా.. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట…

Srikanth Mవాట్సాప్
ambajipeta marriage band movie first single release date fixed
రిలీజ్ అప్‌డేట్

అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రస్తుతం దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Tweets as His Movie Khaidi Completes 40 Years
సినిమా వార్తలు

ఖైదీకి 40 ఏళ్ళు.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్

'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో తనను శాశ్వత 'ఖైదీ'ని చేసిందని, తన జీవితంలో ఆ చిత్రం ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి. కాగా నేటితో ఆ చిత్రం విడుదలై 40 ఏళ్ళు పూర్తవుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చిరంజీవి దీనికి సంబంధించి తన భావాలను పంచుకున్నారు. 'ఖైదీ' చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిదని చెప్పిన ఆయన, అందుకు వారికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన నటీ, నటులకు మరియు టెక్నీషియన్లను అభినందనలు తెలియజేశారు. 'ఖైదీ' చిత్ర దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి గారికి, నిర్మాతలు సంయుక్తా మూవీస్…

Srikanth Mవాట్సాప్
Pawan Kalyan Left For Italy with Wife to Attend Varun Tej and Lavanya Tripathi's Wedding
సినిమా వార్తలు

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌.. సతీసమేతంగా ఇటలీకి పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలికాలంలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాజకీయంగానూ పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఆయన తన కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఇటలీకి పయనమయ్యారు. కాగా పవన్ సోదరుడు నాగబాబు కుమారుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మరియు నటి లావణ్య త్రిపాఠిల వివాహానికి హాజరయ్యేందుకు కుటుంబంతో సహా ఇటలీకి బయలుదేరారు. ఈ క్రమంలో తన సతీమణి అన్నా లెజ్నెవాతో కలిసి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్‌…

Srikanth Mవాట్సాప్
Bhagavanth Kesari 9 days Box Office Collections
బాక్సాఫీస్

భగవంత్ కేసరి- అన్ స్టాపబుల్ 9 డేస్ కలెక్షన్స్

ఈరోజుల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోవడం అంటే మాములు విషయం కాదు. కానీ అలాంటి రేర్ ఫీట్ ను అందుకున్నాడు నటసింహం బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి తాజాగా భగవంత్ కేసరి సినిమాతో వరుసగా బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద…

TFN Adminవాట్సాప్
vijay deverakonda to grace keeda cola movie pre release event
సినిమా వార్తలు

కీడా కోలా కోసం ఫ్యామిలీ స్టార్

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. కీడా కోలా అంటూ క్రైమ్ కామెడీ సినిమాగా రాబోతున్న ఈసినిమాలో ఈసినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు అప్డేట్లు ఇచ్చారు. ఇక అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి.

TFN Adminవాట్సాప్
Jr NTR Joins The New Schedule of Devara in Goa
షూటింగ్ అప్‌డేట్

దేవర కొత్త షెడ్యూల్‌ షురూ.. గోవాకు పయనమైన జూ. ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'దేవర'. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో జూనియర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా.. వరల్డ్‌వైడ్‌ బ్లాక్ బస్టర్ హిట్ 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా 'దేవర'పై అంతటా…

Srikanth Mవాట్సాప్
vikrams thangalaan movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ తంగలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. నిజానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ మధ్యలో విక్రమ్ గాయపడటంతో కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై ఆసక్తిని పెంచాయి.

TFN Adminవాట్సాప్
Sapta Sagaralu Dhaati Side B Teaser Released
ట్రైలర్ & టీజర్

సప్త సాగరాలు దాటి - సైడ్ బి టీజర్ రిలీజ్

‘777 చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ కన్నడ మూవీ 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ'. ఈ మూవీలో రక్షిత్‌ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం. ఈ క్రమంలో కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెలుగులో 'సప్త సాగరాలు దాటి' పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

Srikanth Mవాట్సాప్

షేర్