పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. నిజానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ మధ్యలో విక్రమ్ గాయపడటంతో కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై ఆసక్తిని పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈమేరకు మరో కొత్తపోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. కొత్తపోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచాయి.
Even the darkest mines shall glimmer with a golden beacon of hope💫
Unveiling the #ThangalaanTeaser on 1st November, 2023
The realm of #Thangalaan✨ will open its gates worldwide on 26th January 2024 #ThangalaanFromJan26 pic.twitter.com/Wy8yOX7hnY
— Mango Mass Media (@MangoMassMedia) October 27, 2023
కాగా పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈసినిమాను రిలీజ్ చేయాలను ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: