‘777 చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ కన్నడ మూవీ ‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్-ఏ’. ఈ మూవీలో రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం. ఈ క్రమంలో కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ రెండు భాగాలుగా రూపొందింది. ఇక తొలి పార్ట్ హిట్ అవ్వడంతో సీక్వెల్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అటు కన్నడ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రెండో పార్ధు విడుదలకు సంబంధించి మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. నవంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు సదరు నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘సప్త సాగరాలు దాటి – సైడ్ బి’ పేరుతో వస్తున్న ఈ సినిమా టీజర్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇక ఈ సినిమాను హీరో రక్షిత్ శెట్టి తన స్వంత బ్యానర్‌పై నిర్మించడం విశేషం. అలాగే గుండు శెట్టి సహ రచయితగా వ్యవహరించగా.. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం అందించారు.
Has that beautiful dream, turned into a nightmare?
Reality strikes the big-screens on Nov 17th! #SaptaSagaraluDhaati #SSDSideB
Here’s the LINK to the teaser: https://t.co/TFAAXnIVzk#SSESideBNov17 @rakshitshetty @hemanthrao11 @rukminitweets @Chaithra_Achar_… pic.twitter.com/HQs5YeC0k4
— People Media Factory (@peoplemediafcy) October 28, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: