
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 261


భగవంత్ కేసరి హిందీ రిలీజ్ పై బాలయ్య క్లారిటీ

టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టిన ఆదిపురుష్

నాన్నగారి చరిత్రకు ఇది ఘనమైన నివాళి

సలార్ తమిళ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?

కన్ఫామ్.. ఇళయరాజా బయోపిక్ లో ధనుష్

జిగర్ తండ డబల్ ఎక్స్ పై ధనుష్ రివ్యూ

8000 ఆర్టిస్టులతో ఇండియన్ 2 షూట్

కంగువ ఫైనల్ షెడ్యూల్ షురూ

పొలిమేర 2 లేటెస్ట్ కలెక్షన్స్

కెప్టెన్ మిల్లర్ నుండి సందీప్ ఇంటెన్స్ లుక్

మంగళవారంకు అల్లు అర్జున్ సాయం

ఆకట్టుకుంటున్న విక్రమ్ ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్

సప్త సాగరాలు దాటి సైడ్ బి టైటిల్ సాంగ్ రిలీజ్
హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది. ఈసినిమా రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే కదా. నవంబర్ 17వ తేదీన సెకండ్ పార్ట్ ను రిలీజ్ చేయనున్నారు. సప్త సాగరాలు దాటి-సైడ్ బి అంటూ తెలుగులో రిలీజ్ అవుతుంది.

హరోం హర నుండి సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ఈ ఏడాది ఇప్పటికే హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు సుధీర్ బాబు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో హరోం హర సినిమా కూడా ఒకటి. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే శరవేగంగా జరుపుకుంటుంది. ఆమధ్య ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అది బాగానే ఆకట్టుకుంది.

భగవంత్ కేసరి హిందీ రిలీజ్ పై బాలయ్య క్లారిటీ
హిట్ అయిన సినిమాలను వేరే భాషలో రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈనేపథ్యంలోనే ఇప్పటికే మన తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా మరేదో కాదు రీసెంట్ గా వచ్చి ప్రేక్షకాదరణ పొందిన భగవంత్ కేసరి సినిమా. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఈసినిమా అందరికీ నచ్చడంతో సూపర్ హిట్ అయింది.

టీఆర్పీ రేటింగ్స్ లో అదరగొట్టిన ఆదిపురుష్
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ ఈ జూన్ లో విడుదలై 500కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈసినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా సీతగా కృతి సనన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. ఇక ఈసినిమా టీవీ లో కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈసినిమా ను స్టార్ మా మొదటి సారి అక్టోబర్ 29న వరల్డ్ ప్రీమియర్ మూవీ గా టెలికాస్ట్ చేయగా 10.6 రేటింగ్స్ ను రాబట్టుకుంది.అజయ్ అతుల్ ఈసినిమాకు సంగీతం అందించగా భూషణ్ కుమార్ ,ప్రసాద్ సుతార్, కృష్ణన్ కుమార్ ,వంశీ ,ప్రమోద్ కలిసి నిర్మించారు.

నాన్నగారి చరిత్రకు ఇది ఘనమైన నివాళి
అలనాటి దివంగత సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో నటనతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో గుర్తింపుతెచ్చారు. సుమారు ఐదు దశాబ్దాల పాటు హీరో, నిర్మాత, దర్శకుడిగా అన్నీ పాత్రలు పోషించిన కృష్ణ 300పైగా చిత్రాల్లో నటించారు. ఇక గత ఏడాది నవంబర్ 15వ తేదీన ఆయన మరణించిన సంగతి తెలిసిందే కదా. అయితే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్న దేవినేని అవినాష్ తో కలిసి లోకనాయకుడు కమలహాసన్ ఆవిష్కరించారు.

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్- యూత్ ఫుల్ బ్రష్ వేసుకో సాంగ్ రిలీజ్
సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే మంచి హిట్ కోసం మాత్రం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నాడు. భీష్మ తరువాత ఇప్పటివరకూ సరైన సక్సెస్ ను అందుకోలేకపోయిన నితిన్ సరైన హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాతో వస్తున్నాడు. డిసెంబర్8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టశారు మేకర్స్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

గుంటూరు కారంలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే? - నమ్రతా శిరోద్కర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడం, అలాగే మహేష్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో 'గుంటూరు కారం'పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సతీమణి, ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్ ఈ మూవీకి సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆమె అక్కడ ఒక మీడియా ప్రతినిధితో కొద్దిసేపు చిట్ చాట్ చేశారు.

సలార్ తమిళ్ లో రిలీజ్ చేసేది ఎవరంటే?
ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది ఈసినిమా. ఇక ఈసినిమా రిలీజ్ పై పలు రూమర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ ఈసినిమా చెప్పిన తేదీకే అంటే డిసెంబర్ 22వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లారిటీ ఇచ్చారు.

బాలయ్య బాబు బాంబ్ లాంటి వాడు - దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్‌గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా, శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది. ‘భగవంత్ కేసరి' సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ సాధించి నందమూరి బాలకృష్ణ కెరీర్…

కన్ఫామ్.. ఇళయరాజా బయోపిక్ లో ధనుష్
ఇప్పటి వరకూ ఎన్నో బయోపిక్ లు వచ్చాయి. ఎంతోమంది ప్రముఖుల బయోపిక్ లు వచ్చి అలరించాయి. ఇప్పుడు మరో లెజెండ్ బయోపిక్ రాబోతుంది. ఆ బయోపిక్ ఎవరిదో కాదు భాషతో సంబంధం లేకుండా ఎన్నో చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా ది.

విజయవాడలో సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
దివంగత నటుడు, టాలీవుడ్ సూపర్‌స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహావిష్కరణ విజయవాడలో ఘనంగా జరిగింది. కాగా నగరంలోని స్థానిక గురునానక్ కాలనీ వద్ద గల కేడీజీవో పార్కులో సూపర్‌స్టార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం (నవంబర్ 10, 2023) కృష్ణ విగ్రహాన్ని కోలీవుడ్ స్టార్ హీరో, ఉలగనాయగన్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. నేటి ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి అధికార వైసీపీ నేత దేవినేని అవినాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణ, మహేష్ బాబు అభిమానులు భారీగా తరలివచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం కమల్ హాసన్ సూపర్ స్టార్ అభిమానులకు చేతులు ఊపి అభివాదం తెలిపారు.

సత్యభామ టీజర్ రిలీజ్.. పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ నటన ఎలా ఉందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో జోడీకట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'సత్యభామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కాగా ఇది కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న 60వ సినిమా కావడం గమనార్హం. ఇందులో కాజల్‌తో పాటు విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, ట్యాలెంటెడ్ యాక్టర్ నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్నారు. వచ్చే ఏడాది సమ్మర్…

జిగర్ తండ డబల్ ఎక్స్ పై ధనుష్ రివ్యూ
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో లారెన్స్,ఎస్.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుంది అనే చూడాలి.

దాసరిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన బాలకృష్ణ
టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలైన విషయం తెలిసిందే. మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా…

8000 ఆర్టిస్టులతో ఇండియన్ 2 షూట్
లోకనాయకుడు కమల్ మాత్రం ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. ఇండియన్ 2, కల్కి2898ఏడీ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా రీసెంట్ గానే మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న థగ్ లైఫ్ సినిమాను కూడా మొదలుపెట్టాడు. ఇవి కాకండా ఇంకా లోకేష్ కనగరాజు దర్శకత్వంలో అలానే హెచ్.వినోథ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

కంగువ ఫైనల్ షెడ్యూల్ షురూ
శివ దర్శకత్వంలో సూర్య హీరోగా వస్తున్న సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి గ్లింప్స్ ను అలానే పలు పోస్టర్లను రిలీజ్ చేయగా అవి సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. ఇక దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే తాజాగా ఈసినిమా షూటింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ ను నేడు చెన్నైలో మొదలుపెట్టింది చిత్రయూనిట్. చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షూటింగ్ లో సూర్యతో…

పొలిమేర 2 లేటెస్ట్ కలెక్షన్స్
దసరా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించడంతో రీసెంట్ గా విడుదలైన సినిమాలు అదరగొడుతున్నాయి.అందులో భాగంగా గత వారం విడుదలైన మా ఊరి పొలిమేర 2 సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.మౌత్ టాక్ బాగుండడంతో ఈసినిమా 6రోజుల్లో 14.7కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 7కోట్లకు పైనే.కేవలం 4కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకొని బయ్యర్లకు భారీ లాభాలను అందిస్తుంది.ఫుల్ రన్ లో ఈసినిమా 20కోట్ల గ్రాస్ ను చేరుకొనే అవకాశం లేకపోలేదు.

కెప్టెన్ మిల్లర్ నుండి సందీప్ ఇంటెన్స్ లుక్
అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. 1930 - 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

మంగళవారంకు అల్లు అర్జున్ సాయం
ఆర్ ఎక్స్ 100తో సెన్సేషనల్ హిట్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అజయ్ భూపతి నుండి వస్తున్న మూడో సినిమా మంగళవారం.టైటిల్ ఆసక్తిని క్రీయేట్ చేయగా రీసెంట్ గా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాకు హైప్ ను తీసుకొచ్చింది.ముఖ్యంగా ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇక ఈ హైప్ ను ఇంకా పెంచడానికి ఓ స్టార్ హీరోను వాడుకుంటుంది చిత్ర బృందం.అందులో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది.ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథి గా రానున్నాడు.ఈ శనివారం ఈఈవెంట్ హైదరాబాద్ లోని జె ఆర్ సి కన్వెన్షన్ లో సాయంత్రం 6గంటలకు జరుగనుంది.

ఆకట్టుకుంటున్న విక్రమ్ ధ్రువ నక్షత్రం తెలుగు ట్రైలర్
మొత్తానికి ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న విక్రమ్ ధ్రువనక్షత్రం సినిమా రిలీజ్ కాబోతుంది. తమిళ్ లో ధృవ నచ్చత్తిరం అంటూ రిలీజ్ అవుతుండగా.. తెలుగులో ధ్రువ నక్షత్రం టైటిల్ తో రిలీజ్ అవుతుంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈసినిమాలో.. జాన్ అనే స్పై క్యారెక్టర్ లో నటిస్తున్నాడు విక్రమ్. ఈ సినిమా 2017లోనే రిలీజ్ అవ్వాలి కానీ అప్పటినుండీ పెండింగ్ లోనే ఉంది. ఫైనల్లీ ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.