
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 248


రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ షూటింగ్ మొదలు

హాయ్ నాన్న లో చూడాలనుకునే ఆసక్తికర అంశాలు

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్


హాయ్ నాన్న ప్రీమియర్ షోస్ క్యాన్సల్

నాక్కొంచం తిక్కుంది అంటున్న శ్రీలీల

పాపులర్ ఇండియన్ సెలబ్రటీస్ లిస్ట్ లో బాలయ్య
అగ్రహీరో బాలకృష్ణ మాత్రం ఈ వయసులో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క టెలివిజన్ షోస్.. రాజకీయాలు ఇలా బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు యంగ్ హీరోలకు సైతం పోటీఇస్తూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టడమే కాదు.. ఈసినిమాతో హ్యాట్రిక్ ను సైతం అందుకుంది. ఈసినిమా రీసెంట్ గానే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఓటీటీ లో కూడా ఈసినిమా తన హవా ను చాటింది. ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

హాయ్ నాన్న.. ఫేవరేట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలుస్తుంది - నాని
'హాయ్ నాన్న' ఆడియన్స్‌కి ఈ ఇయర్లో ఫేవరెట్ ఫిల్మ్ అవుతుందని పేర్కొన్నారు నేచురల్ స్టార్ నాని. ఆయన హీరోగా వస్తోన్న హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్టైన్మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది.

ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబినేషన్స్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒకటి. ఈసినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది ఎన్టీఆర్ 30వ సినిమా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

యానిమల్‌లో హీరోయిన్గా.. సందీప్ వంగ ఫస్ట్ ఛాయిస్ ఎవరంటే?
సందీప్ రెడ్డి వంగ.. ఈ తెలుగు డైరెక్టర్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. 'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా తెరకెక్కించిన ఆయన.. తన తదుపరి సినిమాకు కూడా మళ్ళీ బాలీవుడ్‌నే ఎంచుకున్నాడు. ఈసారి రణ్‌బీర్ కపూర్ హీరోగా హిందీలో 'యానిమల్' సినిమాను రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది.

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’లాంటి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు - హీరో నితిన్
టాలీవుడ్ హీరో నితిన్, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. ప్రముఖ రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు నితిన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివే..

బబుల్ గమ్- జాను ఎమోషనల్ సాంగ్ రిలీజ్
దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. ఈసినిమాపై మంచి ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ముఖ్యంగా రోషన్ నటన ఈసినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతుందన్న అభిప్రాయాలు ఇప్పటికే వచ్చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలను రిలీజ్ చేయగా రెండు పాటలకూ మంచి రెస్పాన్స్ వచ్చింది.

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ షూటింగ్ మొదలు
ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. ఇన్ని రోజులు యానిమల్ సినిమాతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు తన కొత్త సినిమాలతో బిజీ అయిపోతుంది. ప్రస్తుతం పలు సినిమాలు రష్మిక లిస్ట్ లో ఉన్నాయి. ఒకపక్క హీరోల పక్కన చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.

త్వరలో నా సామిరంగ ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమో
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'నా సామిరంగ'. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. 'నేను లోకల్', 'ధమాకా' సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథనందించగా.. ఆస్కార్ మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

హాయ్ నాన్న- ఇదే ఇదే ఫీల్ గుడ్ మెలొడీ సాంగ్ రిలీజ్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా హాయ్ నాన్న. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తండ్రి-కూతరు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాతో పాటు లవ్ స్టోరీని జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిత్రయూనిట్ కూడా ఈసినిమాకు వీలైనంత బజ్ ను క్రియేట్ చేయడానికి ప్రమోషన్ కార్యక్రమాల్లో ఏమాత్రం రాజీ పడట్లేదు. ఒకపక్క నాని పలు ఈవెంట్లలో పాల్గొంటూ.. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా తిరిగేస్తున్నాడు. మరోపక్క చిత్రయూనిట్ కూడా ఇంకా పలు అప్ డేట్లు ఇస్తున్నారు.

అన్‌స్టాపబుల్ యానిమల్.. 5 డేస్ కలెక్షన్స్ వివరాలు
బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'యానిమల్'. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తికపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కు రెడీ
టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్'. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.

హాయ్ నాన్న లో చూడాలనుకునే ఆసక్తికర అంశాలు
న్యాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా హాయ్ నాన్న. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ ప్లస్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పటివరకూ రిలీజ్ చేసిన అప్ డేట్లతో ఈసినిమాకు మంచి హైప్ ను తెచ్చిపెట్టాయి. ఈసినిమా ఇంకా ఒక్క రోజులో థియేటర్లలోకి రానుంది. మరి ఈసినిమాలో ఇంట్రెస్టింగ్ అంశాలు ఏం ఉన్నాయో చూద్దాం.

చెన్నైలో వరదలు.. అమీర్ ఖాన్, విష్ణు విశాల్‌కు అజిత్ సాయం
కాగా బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ తమిళనాడును అతలాకుతలం చేసింది. తుఫాన్ ప్రభావంతో రెండు, మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షపాతం కారణంగా చెన్నైలో రోడ్లు జలమయం అయ్యాయి. పలుచోట్ల పార్క్ చేసిన కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలు, అనేక ప్రైవేట్ కార్యాలయాలు మూసివేశారు. ఈదురు గాలులతో నగరమంతటా చెట్లు, గోడలు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి కూడా వరద నీరు ప్రవేశించడంతో ఆరోగ్య సంరక్షణ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈగల్- మాస్ బీట్ తో ఆడు మచ్చా ఫుల్ సాంగ్ రిలీజ్
రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజా రవితేజ ఈసారి మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అయితే రవితేజ కు కూడా ఈమధ్య సరైన హిట్ అనేది రాలేదు. దీంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక షూటింగ్ కంప్లీట్ చేసుకున్నఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా పొంగల్ రేసులో బరిలోకి రానుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా..టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

గుంటూరు కారం షూటింగ్ అప్డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం ఈరోజుతో సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేక సెట్ లో మహేష్, శ్రీలీల ఫై సాంగ్ చిత్రీకరణ జరిపారు. తదుపరి షెడ్యూల్ కేరళ లో జరుగనుంది. ఇందులో కూడా మరో సాంగ్ ను షూట్ చేయనున్నారు.ఆతరువాత ఇంకో సాంగ్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంటుంది.ఈనెల మూడో వారంలో సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేయనున్నారు.

నాని ని నేచురల్ స్టార్ అని ఎందుకంటారో.. ‘హాయ్ నాన్న’ చూశాక అర్ధమైంది - మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్టైన్మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి…

హాయ్ నాన్న ప్రీమియర్ షోస్ క్యాన్సల్
నాని నటించిన హాయ్ నాన్న మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది.బ్యూటిఫుల్ ఎమోషనల్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కింది.సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది.ముఖ్యంగా ఇంటర్వల్ సీక్వెన్స్ అలాగే క్లైమ్యాక్స్ చాలా బాగా వచ్చిందట.గత కొన్ని రోజులనుండి అన్ని తానై సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు నాని.సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు.

రాజశేఖర్ గారు లేకపోతే ఈ సినిమాను ఊహించుకునేవాడ్ని కాదు - వక్కంతం వంశీ
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. ఈ సినిమాకు 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ మూవీ డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ…

యానిమల్ కు 4వ రోజు షాకింగ్ కలెక్షన్స్
మొదటి మూడు రోజులు వరుసగా 100కోట్లకు పైగా వసూళ్ల సునామి సృష్టించిన యానిమల్ నాలుగో రోజుకూడా హావ కొనసాగించింది.వర్కింగ్ డే కావడంతో సినిమా స్లో అవుతుందేమో అనే సందేహలు వచ్చాయి కానీ అంచనాలను మించి స్ట్రాంగ్ హోల్డ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 69కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతంచేసుకుంది దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా 425కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.రేపటి తో 500కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

నాక్కొంచం తిక్కుంది అంటున్న శ్రీలీల
వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమాతో ఎలాగైనా మంచి హిట్ ను కొట్టాలని ఎదురుచూస్తున్నాడు నితిన్. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపిస్తున్నాడు. చాలా కాలం తరువాత నితిన్ మరోసారి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇక డిసెంబర్ 8వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆసక్తి పెంచేశాయి.