ఎన్టీఆర్ సినిమాపై ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

prashanth neel shared interesting facts about jr ntr movie

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న కాంబినేషన్స్ లో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఒకటి. ఈసినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది ఎన్టీఆర్ 30వ సినిమా. ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ కెరీర్ లో వస్తున్న 31వ సినిమా ఇది. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి అయితే చాలా టైమే పడుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ పుట్టినరోజుకు మాత్రం ఓక పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే తాజాగా ఈసినిమా గురంచి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు ప్రశాంత్ నీల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ సినిమా చాలా డిఫరెంట్ గా డిఫరెంట్ ఎమోషన్స్ తో ఉంటుంది. అందరూ ఈసినిమాను ఖచ్చితంగా యాక్షన్ సినిమా అనుకుంటారు.. కానీ ఈ కథ నాకు కొత్త కథ.. ఈ కథను ఆడియన్స్ కు చెప్పాలనుకుంటున్నా.. ఈ సినిమా తన సొంత ఎమోషన్ ను కలిగి ఉంటుంది అని తెలిపాడు. దీంతో ఇప్పుడు ప్రశాంత్ నీల్ చేసిన వ్యాఖ్యలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీలో ఉండగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 7 =