టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తోన్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి సీనియర్ రైటర్ కమ్ డైరెక్టర్, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ దీనిని ప్రకటించారు. కాగా సినిమా రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే టీజర్, ట్రైలర్‌లకు మంచి అప్లాజ్ వచ్చింది.
It’s “U/A”
Get ready for a rollercoaster of #EXTRA fun with #ExtraOrdinaryMan 🥳🕺
Releasing Worldwide on DEC 8th 🔥#ExtraOrdinaryManOnDec8th @actor_nithiin @ActorRajasekhar @sreeleela14 @vamsivakkantham @Jharrisjayaraj #SudhakarReddy #NikhithaReddy @sahisuresh pic.twitter.com/pxFNiAMOn4
— Sreshth Movies (@SreshthMovies) December 6, 2023
ఇదే క్రమంలో తాజాగా ‘ఓలే ఓలే పాపాయి’ సాంగ్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ మాస్ బీట్‌తో సాగిన ఈ పాటలో నితిన్, శ్రీలీల తమ స్టెప్‍లతో అదరగొట్టారు. కాగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ విడుదలవుతున్న డిసెంబర్ 8నే నేచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా కూడా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాల మధ్య పోటీ నెలకొంది. అయితే, ఆయా చిత్రబృందాలు మాత్రం తమ సినిమాల్లో కంటెంట్ ఉందని, తప్పకుండా హిట్ కొడతామని విశ్వాసంగా ఉన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: