నాని ని నేచురల్ స్టార్ అని ఎందుకంటారో.. ‘హాయ్ నాన్న’ చూశాక అర్ధమైంది – మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్

Hi Nanna Music Director Hesham Abdul Wahab Interesting Comments on Hero Nani

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రుతి హాసన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి సెన్సేషనల్ సూపర్ హిట్ ఆడియో అందించిన స్టార్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ‘హాయ్ నాన్న’ విశేషాలని విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగులో చేసిన మొదటి చిత్రంతోనే ఇక్కడ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు కదా.. ఈ ఆదరణ ఎలా అనిపిస్తోంది?

చాలా ఆనందంగా వుంది. అయితే ఇంకా చాలా నేర్చుకోవాలి. ప్రతి సినిమా ఒక పరీక్షే. ప్రతి సినిమా ఒక లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇంకా కొత్తగా ఎక్స్‌ఫ్లోర్ చేయాలి. హాయ్ నాన్న చిత్రం నన్ను నేను ఎక్స్‌ఫ్లోర్ చేసుకోవడానికి తోడ్పడింది.

హృదయం, ఖుషి, హాయ్ నాన్న..ఇలాంటి చిత్రాలన్నిటిలో కామన్ గా లవ్, రొమాన్స్, డ్రామా వుంటుంది కదా.. వీటిలోనే కొత్తదనం చూపించడానికి ఎలాంటి కసరత్తులు చేస్తారు?

ఇది కేవలం సంగీత దర్శకుడే కాదు.. దర్శకుడు, రచయిత, ఎడిటర్.. అలా అందరూ కొత్తదనం ఎలా చూపించాలనే విషయంపైనే దృష్టి పెడతారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమ ఒకేలా వుంటుంది. ఒకరు ప్రేమను అంగీకరించడం, మరొకరు తిరస్కరించడం, మనస్పర్థలు రావడం, విడిపోవడం, మళ్ళీ కలవడం ఇలాంటి పరిస్థుతులే వుంటాయి. అయితే ఆ కథని ఎంత యూనిక్‌గా చెబుతున్నామనేది ఇక్కడ ముఖ్యం.

‘కాదల్’, ‘రోజా’, ‘ముంబై’, ‘ఓకే బంగారం’.. ఇలా ఈ చిత్రాల థీమ్స్ సిమిలర్‌గా ఉండొచ్చు. అయితే దర్శకుడు ఆ కథని ఎలా చెప్పారనే దానిపైనే వైవిధ్యం ఆధారపడి వుంటుంది. సంగీతం కూడా అలానే వుంటుంది. ప్రేమ పాటల్ని విన్నప్పుడు ఒకే ఎమోషన్ వుంటుంది. హాయిగా, రొమాంటిక్‌గా ఫీలౌతాం. అయితే ఆ పాట ఎవరు పాడారు, అక్కడ ఎలాంటి సాహిత్యం, సందర్భం వుందనేది కొత్త క్రియేషన్ తీసుకొస్తుంది.

దర్శన, సమయమా.. ఈ రెండు పాటలకు చాలా మంది పోలికలు తీసుకొస్తున్నారు.. దీని గురించి?

ఈ పోలిక తీసుకురావడం సహజమే. ఎందుకంటే ‘దర్శన’, ‘సమయమా’.. ఈ రెండు పాటల మొదటి నోట్ ఒకేలా వుంటుంది. కానీ ‘దర్శన’ కంటే క్లాసిక్ కంపోజిషన్ సమయమాలో వినిపిస్తుంది. అయితే ఆడియన్స్ చాలా తెలివిగా, అప్‌డేట్‌గా వుంటారు. ‘దర్శన’తో పోలిక పెట్టడం ఆనందమే. రెండు పాటలు వైరల్ అయ్యాయి (నవ్వుతూ).

నిరంతరం కొత్త ట్యూన్స్ ఇవ్వడం కోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రతలు తీసుకుంటారు?

నా వరకూ దర్శకుడు విజన్‌ని ఫాలో అవుతాను. ‘హాయ్ నాన్న’ విషయానికి వస్తే నేను, మా మ్యూజిక్ టీం, దర్శకుడు శౌర్యువ్‌కి ఏం కావాలో అది ఇవ్వడానికి ప్రయత్నించాం. హాయ్ నాన్న వెరీ సాఫ్ట్ రొమాంటిక్ మూవీ. సంగీతం కూడా అంతే సాఫ్ట్‌గా చేశాం. మీరు బాగా పరిశీలిస్తే హాయ్ నాన్నలో లైటింగ్ విజువల్స్, మ్యూజిక్ ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా మనసుకి ప్రశాంతతని ఇచ్చేలా వుంటాయి.

దర్శన, ఖుషి, సమయమా, అమ్మాడి.. ఇలా మీ పాటల్లో ఒక పదంతో హుక్ చేసే స్వభావం కనిపిస్తుంది.. దీని గురించి చెప్పండి?

సహజంగానే ఒక పదంతో పాటలోకి వెళ్ళడం నాకు ఇష్టం. ఇందులో అమ్మాడి పాట చేసినప్పుడు కూడా ముందు.. ఆ పదంపైనే దృష్టి పెట్టాను. లిరిక్స్ రైటర్స్‌కి ప్రత్యేకంగా అడిగాను. అలాగే ‘గాజుబొమ్మ’, ‘సమయమా’ పాటలు కూడా పదాలతోనే ముందుగా హత్తుకుంటాయి. అందరికి తెలిసిన, సహజంగా వాడుకలో వున్న ఇలాంటి పదాలతో వున్న పాటలు ఎక్కువ కాలం నిలుస్తాయని భావిస్తాను.

ఈ మధ్య కాలంలో పాటల్లో చరణాలు వుండటం లేదు కదా.. దీనిపై మీ అభిప్రాయం?

ఇది పూర్తిగా దర్శకుడు చేతిలో వుంటుంది. హాయ్ నాన్న సినిమా గురించి చెప్పాలంటే.. లాస్ట్ వీక్ వర్క్ పూర్తి చేసినప్పటికీ ఇంకా ఈ సినిమా హ్యంగోవర్ లోనే వున్నాను. దర్శకుడు శౌర్యువ్‌ పాటల్ని అద్భుతంగా ప్రజంట్ చేశారు. సినిమా చూసినప్పుడు నేనే సర్‌ప్రైజ్ అయ్యాను. పల్లవి ఒక చోట, చరణం మనకు సర్‌ప్రైజ్ ఇచ్చేలా మరోచోట చాలా అద్భుతంగా కుదిర్చారు. ‘సమయమా’ పాట శైలి చాలా భిన్నంగా వుంటుంది. ‘గాజు బొమ్మ’ పాటలో రెండు చరణాలు వుంటాయి. శౌర్యువ్‌ రెండు ఫార్మెట్స్‌ని చాలా చక్కగా చూపించారు. ఇందులో ప్రతి పాటకు ప్రాముఖ్యత వుంటుంది. మ్యూజిక్ పరంగా అందుబాటులో వున్న అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేశాం.

‘హాయ్ నాన్న’ చూసినప్పుడు ఎలా అనిపించింది?

వందకి వంద శాతం నమ్మకంతో చెబుతున్నా.. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చే చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన చిత్రాలని చూస్తారు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప కథలు వచ్చాయి. అందులో ‘హాయ్ నాన్న’ కూడా తనకంటూ ఒక ముద్ర వేసుకుంటుంది. నాని గారి నటన అద్భుతంగా వుంటుంది. నాని గారిని నేచురల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్ధమైయింది. అలాగే ఇందులో మృణాల్, బేబీ కియరా.. ఇలా అందరి పాత్రలు మనసుని హత్తుకునేలా వుంటాయి.

ఓడియమ్మ పాట గురించి చెప్పండి?

కథలో ఒక పెద్ద పార్టీ సాంగ్ వుంది. ఆ విజువల్స్ మ్యాచ్ చేసే ఎనర్జిటిక్ నెంబర్ కావాలి. ఆ ఎనర్జీని పట్టుకోవడానికి కొంత సమయం పట్టింది. ఒక ట్యూన్ రికార్డ్ చేసి శౌర్యువ్‌కి సెండ్ చేశాను. అది ఆయనకి చాలా నచ్చింది. మనకి కావాల్సిన ఎనర్జీ ఇదే అన్నారు. ఈ పాటని ద్రువ్‌తో పాడించాలానే ఆలోచన శౌర్యువ్‌దే. అలాగే శ్రుతి హసన్ గారు కూడా అద్భుతంగా పాడారు.

వైర ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ హౌస్ గురించి?

వైర ఎంటర్‌టైన్‌మెంట్ వండర్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్. ఈ సినిమా కోసం 15 మంది మ్యుజిషియన్స్ దాదాపు 40 రోజులు హైదరాబాద్‌లో పని చేశాం. మరో 20 మందికి పైగా ప్లేయర్స్ రికార్డింగ్స్‌లో పాల్గొన్నారు. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్‍గా సినిమాని నిర్మించారు. మ్యూజిక్ అంతా హైదరాబాద్‌లోనే చేశాం.

కొత్తగా చేస్తున్న చిత్రాలు ఏమిటి?

శర్వానంద్‌ గారు, శ్రీరాం ఆదిత్య సినిమాకి చేస్తున్నాను. అలాగే రష్మిక గారి గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి పని చేస్తున్నాను.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 15 =