యానిమల్‌లో హీరోయిన్‌గా.. సందీప్ వంగ ఫస్ట్ ఛాయిస్ ఎవరంటే?

Director Sandeep Vanga's First Choice For Heroine Role in Animal

సందీప్ రెడ్డి వంగ.. ఈ తెలుగు డైరెక్టర్ పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’గా తెరకెక్కించిన ఆయన.. తన తదుపరి సినిమాకు కూడా మళ్ళీ బాలీవుడ్‌నే ఎంచుకున్నాడు. ఈసారి రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా హిందీలో ‘యానిమల్’ సినిమాను రూపొందించి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే తాజాగా యానిమల్ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ మేరకు ఆయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా ‘యానిమల్’ సినిమాలో తొలుత హీరోయిన్‌గా రష్మిక మందన్నను అనుకోలేదని తెలిపాడు. ఆమె కంటే ముందు ఈ సినిమాలో మరో బాలీవుడ్ బ్యూటీని తన ఫస్ట్ ఛాయిస్‌గా ఎంచుకున్నాడట. అది మరెవరో కాదు.. స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా. అవును యానిమల్ కోసం ముందుగా ఈ భామనే సెలెక్ట్ చేశాడట సందీప్. ఈ మేరకు పరిణీతి అగ్రిమెంట్ సైన్ కూడా చేసిందంట.

సినిమా షూటింగ్ మరో 10, 12 రోజుల్లో మొదలవుతుంది అనగా.. సందీప్‌కి ఎందుకో అనుమానం వచ్చిందట. అనంతరం లుక్ టెస్ట్ చేయగా.. ‘గీతాంజలి’ పాత్రకు ఆమె అంతగా సెట్ కాలేదని అనిపించిందట ఆయనకు. దీంతో పరిణీతి మంచి నటి అయినప్పటికీ యానిమల్ సినిమాలో పాత్రకు సూట్ కాలేదని ఫీల్ అయిన సందీప్ వంగ ఆమెను తప్పించాడట. ఇలా చేసినందుకు ఆమెకు సారీ కూడా చెప్పాడట ఆయన. ఇక చివరిగా సినిమాలోకి రష్మిక మందన్న ఎంట్రీ ఇచ్చిందట. అయితే ఈ సంగతి ఎలా ఉన్నా.. గీతాంజలి పాత్రకు రష్మిక న్యాయం చేసిందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ జోడీగా.. ప్రియురాలిగా, భార్యగా ఆమె అద్భుత నటన ప్రదర్శించిందని కితాబిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − three =