న్యాచురల్ స్టార్ నాని హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా హాయ్ నాన్న. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తండ్రి-కూతరు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాతో పాటు లవ్ స్టోరీని జోడించి ఈసినిమాను తెరకెక్కించారు. ఈసినిమా మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చిత్రయూనిట్ కూడా ఈసినిమాకు వీలైనంత బజ్ ను క్రియేట్ చేయడానికి ప్రమోషన్ కార్యక్రమాల్లో ఏమాత్రం రాజీ పడట్లేదు. ఒకపక్క నాని పలు ఈవెంట్లలో పాల్గొంటూ.. పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా తిరిగేస్తున్నాడు. మరోపక్క చిత్రయూనిట్ కూడా ఇంకా పలు అప్ డేట్లు ఇస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరోపాటను రిలీజ్ చేశారు. ఇదే ఇదే తొలిసారిగా అంటూ వచ్చే ఫీల్ గుడ్ మెలొడీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాట కూడా ఆకట్టుకుంటుంది. ఈసినిమాకు సంగీతం అందిస్తున్న హేషన్ అబ్దులే ఈపాటను కూడా పాడటం జరిగింది.
Unveiling the heartbeat of #HiNanna! ❤️🔥#IdheIdhe out now 🎧
– https://t.co/oMicmNGEJuExperience the pulse of love beats find their place among your top tracks 💥#HiNanna #HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa
Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN @shouryuv… pic.twitter.com/Bp02cQLAwi
— Vyra Entertainments (@VyraEnts) December 6, 2023
ఇక ఈసినిమాలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































