టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ పాటలకు నృత్యాలను సమకూర్చిన ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ‘నేను లోకల్’, ‘ధమాకా’ సినిమాలకు పని చేసిన ప్రసన్న కుమార్ బెజవాడ ఈ సినిమాకు కథనందించగా.. ఆస్కార్ మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, మిర్న మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. టాలీవుడ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది’ అనే ఫస్ట్ సింగిల్‌ను ఈ వారంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతకంటే ముందుగా ఫస్ట్ సింగిల్ లిరికల్ ప్రోమోను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కాగా ఇటీవలే హీరోయిన్ ఆషికా రంగనాథ్ క్యారక్టర్‌కి సంబంధించిన గ్లింప్స్ రిలీజైన సంగతి తెలిసిందే.
ఇందులో ఆషికా ‘వరలక్ష్మి’ అనే పాత్రలో కనిపించారు. అచ్చ తెలుగు అమ్మాయిలా సంప్రదాయ లంగా, ఓణీలో దర్శనమిచ్చి కుర్రకారు మది దోచేసింది. కాగా గత కొన్నిరోజుల క్రితం నాగార్జున బర్త్ డే సందర్భంగా రిలీజైన ‘నా సామిరంగా’ మూవీ టీజర్ అక్కినేని ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. చాలా రోజుల తర్వాత నాగార్జున ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించడంతో.. సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఏర్పడ్డాయి. దీనికితోడు ఇలా వరుస అప్డేట్స్ రావడంతో దీంతో నాగ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: