రాజశేఖర్ గారు లేకపోతే ఈ సినిమాను ఊహించుకునేవాడ్ని కాదు – వక్కంతం వంశీ

Director Vakkantham Vamsi Reveals Interesting Facts About Extra Ordinary Man

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్‌, లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. ఈ సినిమాకు ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ ఫేమ్ వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్స్‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించగా.. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో చిత్రంలో పనిచేసిన నటీనటులతో పాటు దర్శకుడు, ఇతర టెక్నీషియన్స్ పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా డైరెక్టర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ.. “నేను ఒక్కడ్ని కల కంటే సరిపోదు. హీరో, నిర్మాత, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కలిస్తే నిజం అవుతుంది. ప్రతీ విషయంలో నాకు తోడుగా ఉన్న నితిన్, సుధాకర్ రెడ్డి గార్లకు థాంక్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ప్రతీ పాత్ర ప్రేక్షకుడికి రిజిస్టర్ అవుతుంది. రాజశేఖర్ గారు లేకపోయి ఉంటే ఈ సినిమాను ఊహించుకునేవాడ్ని కాదు. ఆయన ఈ పాత్రను చేయాలని బలంగా కోరుకున్నాను. నా నమ్మకమే నిజం అయింది. ఆయన ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మామూలుగా ఎంటర్‌టైన్ చేయరు” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “రాజశేఖర్ గారి పాత్ర బాగా వస్తుందా? లేదా? బాగా రాస్తున్నావా? లేదా? అని నితిన్ రోజూ అడిగేవారు. అది ఆయన గొప్పతనం. డిసెంబర్ 8న సినిమా రాబోతోంది. హ్యారీజ్ జైరాజ్ లాంటి సంగీత దర్శకుడితో పని చేసే అవకాశం రావడం అదృష్టం. ఆర్ధర్ విల్సన్, సాయి శ్రీరామ్, యువరాజ్‌ల కెమెరా వర్క్ అందరినీ ఆకట్టుకుంటుంది. నా డైరెక్షన్ టీం, రైటర్స్ టీంకు థాంక్స్. మన ఫ్యామిలీ కోసం ఏం చేయడానికైనా సిద్దం పడతాం. వాళ్ల నవ్వు చూడటానికి ఏమైనా చేస్తాం. అలా రెండున్నర గంటల సేపు ఫ్యామిలీ అంతటిని కడుపుబ్బా నవ్విస్తాం” అని వక్కంతం వంశీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =