ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక రీసెంట్ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని ఫుల్ జోష్ లో ఉంది. ఇన్ని రోజులు యానిమల్ సినిమాతో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు తన కొత్త సినిమాలతో బిజీ అయిపోతుంది. ప్రస్తుతం పలు సినిమాలు రష్మిక లిస్ట్ లో ఉన్నాయి. ఒకపక్క హీరోల పక్కన చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిలసౌ సినిమా దర్శకుడిగా మారిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. యానిమల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉండటం వల్ల రష్మిక ఓపెనింగ్ ఈవెంట్ లో పాల్గొనలేకపోయింది. ఇక ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు మేకర్స్. నేటి నుండి ఈసినిమా షూటింగ్ ను స్టార్ట్ చేసినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలిపింది. రష్మిక కూడా షూటింగ్ లో పాల్గొంది. దీనికి సంబంచిన వీడియో కూడా పోస్ట్ చేశారు.
It is ACTION for the #TheGirlfriend ❤️
Check out now!
– https://t.co/PPUYbLVWONShoot begins 🎬@iamRashmika @23_rahulr @GeethaArts #AlluAravind @SKNOnline #VidyaKoppineedi @DheeMogilineni @HeshamAWMusic @MassMovieMakers #DheerajMogilineniEntertainment pic.twitter.com/YRMCLD6mvi
— Geetha Arts (@GeethaArts) December 6, 2023
కాగా అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈసినిమాకు హేషన్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: