
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 242


2023 శ్రీలీల బెస్ట్ మూవీ?

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్


ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సలార్ సెకండ్ ట్రైలర్

హనుమాన్ టీమ్‌కి అయోధ్య రాముడి ఆశీర్వాదం

సాలిడ్ బిజినెస్ చేసిన డెవిల్

రవితేజ-హరీష్ శంకర్ మూవీ మిస్టర్ బచ్చన్ ప్రారంభం

హరీష్ శంకర్-రవితేజ మూవీ హీరోయిన్ ఫిక్స్

నా సామిరంగ టీజర్ రిలీజ్

బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసిన హాయ్ నాన్న

2024 నాలుగు సినిమాల రిలీజ్ ప్లాన్

ఈగల్ అక్కడ సహదేవ్ గా

సలార్ మిలియన్ దాటేసింది

యానిమల్ లేటెస్ట్ కలెక్షన్స్
మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ వద్ద యానిమల్ జోరు తగ్గడం లేదు.వర్కింగ్ డేస్ లో డీసెంట్ గా హోల్డ్ చేసిన ఈసినిమా వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది దాంతో 17రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 835.9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.నెట్ విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా నిన్నటి తో 460కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఫుల్ రన్ లో 500కోట్ల క్లబ్ లో చేరనుంది.అదే జరిగితే ఈఏడాది జవాన్,పఠాన్,గదర్ 2 తరువాత ఈ ఫీట్ సాధించిన నాలుగవ సినిమాగా యానిమల్ రికార్డు సృష్టించింది.

2023 శ్రీలీల బెస్ట్ మూవీ?
యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది. పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీలకు ఆసినిమా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. రవితేజ ధమాకా సినిమా మాత్రం శ్రీలీల కెరీర్ ను ఒక్కసారిగా మలుపుతిప్పిందని చెప్పింది. ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా తన ఎనర్జీతో తన నటనతో, డ్యాన్స్ తో పోటీ ఇచ్చింది. ఆ సినిమాలో శ్రీలీల నటనకు ప్రశంసలు సైతం దక్కాయి. గతంలో హీరోయిన్లు మాదిరి కాకుండా శ్రీలీల కెరీర్ స్టార్టింగ్ నుండే అటు యంగ్ హీరోలతో చేస్తూనే మరోపక్క సీనియర్ హీరోలతో చేయడం కూడా కలిసొచ్చింది. అందుకే ఒకపక్క యంగ్ హీరోలతో సినిమా ఛాన్స్ లు కొట్టేస్తూనే సీనియర్…

వీకెండ్ లో సత్తా చాటిన హాయ్ నాన్న
నాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న వీకెండ్ లో మంచి గ్రోత్ చూపించింది.శని,ఆదివారాల్లో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 3కోట్లకు పైగా షేర్ ను రాబట్టగలింది.దాంతో మొత్తం 11రోజుల్లో 19కోట్ల షేర్ ను సొంతం చేసుకొని బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసింది.ఇక యూఎస్ఏ లో ఈసినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. నిన్నటి వరకు అక్కడ 1.6మిలియన్ వసూళ్లను దక్కించుకుంది దాంతో 11రోజుల్లో హాయ్ నాన్న ప్రపంచ వ్యాప్తంగా 60కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది.

హీరో నాని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా - డైరెక్టర్ శౌర్యువ్
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న' మ్యాజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ అద్భుతమైన కలెక్షన్స్‌తో అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా బ్లాక్ బస్టర్ సక్సెస్…

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. నిజానికి ఈనెలలోనే ఈసినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఫైనల్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

డెవిల్ నుండి దూరమే తీరమై సోల్ ఫుల్ మెలొడీ ఫుల్ సాంగ్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న మోస్ట్ అవైెటెడ్ సినిమా డెవిల్. లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 29 వ తేదీన ఈసినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటీజర్, ట్రైలర్‌తో పాటు ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది

నాని సినిమాకి వెళ్దామని ప్రేక్షకులు అన్నారంటే.. అదే నాకు గొప్ప స్థాయి - హీరో నాని
నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న' మ్యాజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించింది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ అద్భుతమైన కలెక్షన్స్‌తో అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది…

ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా సలార్ సెకండ్ ట్రైలర్
ప్రస్తుతం ఎక్కడ చూసినా సలార్ మేనియానే కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంటంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈసినిమాకు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై క్రేజ్ ను ఇంకా పెంచుతున్నారు. ఈసినిమా నుండి ట్రైలర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా.

హనుమాన్ టీమ్‌కి అయోధ్య రాముడి ఆశీర్వాదం
టాలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా మారిన తేజ సజ్జా తనకు నప్పే కథలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన లీడ్ రోల్ పోషించిన సూపర్ హీరో చిత్రం 'హనుమాన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ మూవీపై అంచనాలను పెంచగా.. ఇటీవలే రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకున్నాయి. అనుదీప్ దేవ్ అద్భుతంగా…

సాలిడ్ బిజినెస్ చేసిన డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్ నటించినలేటెస్ట్ మూవీ డెవిల్ సాలిడ్ థియేట్రికల్ బజినెస్ చేసింది.రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర్నుండి మంచి ఆఫర్లు వచ్చాయి.నైజాం లో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈసినిమా రైట్స్ ను తీసుకున్నాడు.మిగితా ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లకు అమ్ముడయ్యాయి.ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా 22కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిందని టాక్.

రవితేజ-హరీష్ శంకర్ మూవీ మిస్టర్ బచ్చన్ ప్రారంభం
మాస్ మహారాజా రవితేజ హీరోగా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాను రీసెంట్ గానే అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఇక తాజాగా ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. అంతేకాదు టైటిల్ ను కూడా ప్రకటించారు. 'మిస్టర్ బచ్చన్' అనే పవర్ టైటిల్ ఖరారు చేశారు.నామ్ తో సునా హోగా అనేది క్యాప్షన్. రవితేజ పాత స్కూటర్‌పై షేడ్స్‌తో స్టైల్‌గా కూర్చుని కనిపిస్తున్నారు. అతని వెనుక నటరాజ్ థియేటర్, అమితాబ్ బచ్చన్ ఇమేజ్ చూడవచ్చు బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే కదా. మరి ఈసినిమాలో రవితేజ అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమానిగా కనిపిస్తాడా అన్నది…

సర్కారు నౌకరి నుండి 'నీ పసుపు పాదాలే తగిలి' లిరికల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ గోపరాజు 'సర్కారు నౌకరి' సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. ఆర్కే టెలీషో ప్రై. లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. గంగనమోని శేఖర్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. శాండిల్య పీసపాటి సంగీతం అందిస్తున్నారు. 'సర్కారు నౌకరి' సినిమాలో హీరో ఆకాష్ గోపరాజుతో పాటుగా భావనా వేదపండళ్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్దిరోజుల కిందట విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ కూడా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది.

గుంటూరు కారం గాసిప్స్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇటు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ విజయం సాధించగా.. ‘ఖలేజా” అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో ‘గుంటూరు కారం’ మూడో సినిమాగా వస్తోంది. దీంతో మహేశ్, త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం విశేషం.

హరీష్ శంకర్-రవితేజ మూవీ హీరోయిన్ ఫిక్స్
వెండి తెరపై కొన్ని కాంబినషన్స్ చూడటానికి చాలా బావుంటాయి. అందుకే కొంతమంది డైరెక్టర్స్, హీరోస్ కానీ కాంబినేషన్స్ ను రిపీట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ కాంబినేషన్ మరేదో కాదు రవితేజ-హరీష్ శంకర్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ లో షాక్ ఇంకా మిరపకాయ్ సినిమాలు రాగా అందలో మిరపకాయ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇక ఇన్నేళ్ల తరువాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

నా సామిరంగ టీజర్ రిలీజ్
విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. ఈసినిమా మొదలై ఇన్ని రోజులు చాలా సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అంతేకాదు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పస్ట్ లుక్ తో పాటు ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక నిన్న అల్లరి నరేష్ ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే ఆకట్టుకుంది. అల్లరి నరేష్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ కూడా ఆకట్టుకుంటుంది.

బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసిన హాయ్ నాన్న
నాని హాయ్ నాన్న యూఎస్ఏ లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి తో అక్కడ 1.5మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకొంది.నానికి ఇది మూడో 1.5మిలియన్ డాలర్ మూవీ. ఇక ఫుల్ రన్ లో మరో 300k వరకు రాబట్టే ఛాన్స్ వుంది.నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ను నటించిన 9సినిమాలు మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేశాయి.టాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించిన రెండో హీరో గా ప్రస్తుతం నాని కొనసాగుతున్నాడు. 11సినిమాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో వున్నాడు.

2024 నాలుగు సినిమాల రిలీజ్ ప్లాన్
వెళ్ళి పోమాకే' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై... ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. నాని నిర్మాతగా రూపొందించిన 'హిట్' సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. ఆతరువాత పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలు చేశాడు.

ఈగల్ అక్కడ సహదేవ్ గా
మాస్ రాజా రవితేజ ఈగల్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే నిర్మాతలు రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు.సంక్రాంతికి సినిమా విడుదలవుతుందని తెలిపారు.ఇక ఈసినిమా తెలుగుతోపాటు హిందీలోకూడా విడుదలకానుంది.

ఆగని యానిమల్ కలెక్షన్స్ జోరు- 800 కోట్లకు చేరువలో
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన మోస్ట్ వయోలెంట్ మూవీ యానిమల్. కేవలం యాక్షన్ ను మాత్రమే కాదు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ను కూడా చాలా బాగా చూపించాడు. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి రెండు వారాలు పూర్తయిపోయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ జోరు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. 15 రోజుల్లో ఈసినిమా 797 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతంచేసుకుంది. ఒక్క హిందీలోనే 480 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మరో వైపు తెలుగులో కూడా ఈసినిమా ఇప్పటికే మంచి కలెక్షన్స్ ను…

సలార్ మిలియన్ దాటేసింది
సలార్ మానియా స్టార్ట్ అయ్యింది.బుక్ మై షో లో ఇంట్రెస్ట్ 1.1మిలియన్ కు చేరుకుంది.మరోవైపు నార్త్ అమెరికా లో ప్రీ సేల్స్ మిలియన్ డాలర్ కు చేరుకున్నాయి.ఇక బెంగుళూరు,కేరళ లో కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టికెట్ హైక్ కోసం సలార్ టీం దరఖాస్తు చేసుకున్నారు.ఈ విషయంలో క్లారిటీ రాగానే బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.మరోవైపు తెలంగాణ లో స్పెషల్ షోస్ కి పర్మిషన్ వచ్చే అవకాశాలు వున్నాయి.ఓవరాల్ గా చూస్తే రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ కావాలో సలార్ కు అలాంటి హైప్ వస్తుంది.