ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

operation valentine movie first glimpse out now

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. నిజానికి ఈనెలలోనే ఈసినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఫైనల్ గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + nine =