హీరో నాని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా – డైరెక్టర్ శౌర్యువ్

Hi Nanna Director Shouryuv Praises Hero Nani at Movie Success Celebrations

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ మ్యాజికల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యువ్ దర్శకునిగా పరిచయమయ్యారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, బేబీ కియారా ఖన్నా మరో కీలక పాత్రలో కనిపించింది. ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు విమర్శకులు, ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ అద్భుతమైన కలెక్షన్స్‌తో అన్ని చోట్ల సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌ని నిర్వహించింది. ఈ వేడుకలో హీరో నాని చేతుల మీదుగా చిత్ర యూనిట్ సభ్యులకు మెమెంటోలు అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు శౌర్యువ్ మాట్లాడుతూ.. “సాను జాన్ వర్గీస్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఆయనతో వర్క్ చేయడం గౌరవంగా భావిస్తున్నాను. హేషం హాయ్ నాన్నలో భాగం కావడం చాలా ఆనందంగా, గర్వంగా వుంది. పాటలు, నేపధ్యం సంగీతం నెక్స్ట్ లెవెల్‌లో చేశారు. ఎడిటర్ ప్రవీణ్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్‌కి థాంక్స్. తన వల్ల నాకు చాలా కలిసొచ్చాయి. కృష్ణ కాంత్, ఆనంత్ శ్రీరాం చాలా మంచి సాహిత్యం అదించారు. రైటర్ నాగేంద్ర కాశి గారు హాయ్ నాన్నలో భాగం కావడం అనందంగా వుంది. నా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి ధన్యవాదాలు. నాజర్ గారు, జయరామ్ గారు, శిల్పా గారు చాలా అద్భుతంగా నటించారు. వారితో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది” అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “దర్శి గారు తన పాత్రని పోషించడమే కాదు దానికి సంబధించిన గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. అలాగే అరవింద్ పాత్ర చేసిన అంగద్ బేడి గారికి థాంక్స్. ఈ చిత్రంలో ప్లూటో (డాగ్) కూడా ఒక పాత్రగా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. బేబీ కియారా ఖన్నా రియల్లీ వండర్ కిడ్. ఎంతో సహజంగా చాలా చక్కగా నటిచింది. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాని చాలా బలంగా నమ్మారు. యష్ణ పాత్రలో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశారు. ఇక హీరో నాని గారు ఈ కథని నా కోసం, తెలుగు సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నాను. నాని గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన వలనే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. హాయ్ నాన్న నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్’’ అని దర్శకుడు శౌర్యువ్ పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =