నాని హాయ్ నాన్న యూఎస్ఏ లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి తో అక్కడ 1.5మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకొంది.నానికి ఇది మూడో 1.5మిలియన్ డాలర్ మూవీ. ఇక ఫుల్ రన్ లో మరో 300k వరకు రాబట్టే ఛాన్స్ వుంది.నానికి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ వుంది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ను నటించిన 9సినిమాలు మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేశాయి.టాలీవుడ్ లో ఈ ఫీట్ సాధించిన రెండో హీరో గా ప్రస్తుతం నాని కొనసాగుతున్నాడు. 11సినిమాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హాయ్ నాన్న నిన్నటి వరకు 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. మరో కోటి రూపాయల వరకు రాబడితే బ్రేక్ ఈవెన్ ను చేరుకొన్నట్లే.సలార్ వచ్చే వరకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి కంఫర్ట్ గా టార్గెట్ ను చేరుకుంటుంది.నానికి ఇది వరుసగా ఈ ఏడాది లో రెండో హిట్టు.ఇంతకుముందు సమ్మర్ లో వచ్చిన దసరా 100కోట్ల క్లబ్ లో చేరి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.
ఇక నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.వివేక్ ఆత్రేయ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ డైరెక్టర్ ,నటుడు ఎస్ జె సూర్య ప్రతినాయకుడి పాత్రలో కనిపించనుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: