హనుమాన్ టీమ్‌కి అయోధ్య రాముడి ఆశీర్వాదం

HanuMan Team Received Puja Akshintalu From Ayodhya Ram Mandir

టాలీవుడ్‌లోకి బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోగా మారిన తేజ సజ్జా తనకు నప్పే కథలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఆయన లీడ్ రోల్ పోషించిన సూపర్ హీరో చిత్రం ‘హనుమాన్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని అప్‌డేట్స్ మూవీపై అంచనాలను పెంచగా.. ఇటీవలే రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్‌ చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకున్నాయి. అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచిన మాసీ అండ్ క్లాసీ బీట్స్ మ్యూజిక్ లవర్స్‌ని చాలా ఇంప్రెస్ చేశాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డిసెంబర్ 19న ‘హనుమాన్’ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ‘హనుమాన్’ టీమ్‌కి అరుదైన గౌరవం లభించింది. అదేంటంటే.. అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ రాముడి మందిరం నుండి ఆశీర్వాదం అందింది. ఈ మేరకు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి శ్రీ రాముడి తలపై నుండి నేరుగా పడిన అత్యంత పవిత్రమైన ‘పూజ అక్షింతలు’ ‘హనుమాన్’ టీమ్‌కి అందజేయబడ్డాయి. హీరో తేజ సజ్జా ఈ కానుకను విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధుల నుండి అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో, వీడియోలను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హనుమాన్ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇక ఈ మాగ్నమ్ ఓపస్‌కి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీనాగేంద్ర తంగాల వ్యవహరించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ సహా పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఈ క్రమంలో ‘హనుమాన్’ సినిమాను మొత్తం 12 భాషల్లో డబ్ చేస్తున్నామని, కొన్ని విదేశీ భాషల్లో సైతం రిలీజ్ చేయనున్నామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 4 =