టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇటు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతకుముందు వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ విజయం సాధించగా.. ‘ఖలేజా” అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో ‘గుంటూరు కారం’ మూడో సినిమాగా వస్తోంది. దీంతో మహేశ్, త్రివిక్రమ్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో మూవీకి సంబంధించిన అప్‍డేట్స్ కోసం వారు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొన్ని పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ కొంత గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత నాగవంశీ ఈ వార్తలపై స్పందించారు.. వీటిపై సోషల్ మీడియాలో ఇలా చెప్పారు.. “ప్రియమైన, సూపర్ స్టార్ అభిమానులకు మరియు సినీ ప్రేమికులకు.. ‘గుంటూరు కారం’ చిత్రంలో 4 పాటలు మరియు ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. ఇప్పటివరకూ వీటిలో 3 పాటలు, బిట్ సాంగ్ షూటింగ్ పూర్తి చేశాం. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 21 నుంచి చివరి పాటను చిత్రీకరించబోతున్నాం” అని తెలిపారు.
Dear,
Super Fans and Movie-lovers, #GunturKaaram film has 4 full songs and one bit song. We have finished shooting for 3 songs and one bit song. We are going to shoot for the last song from 21st December as per our Schedule.The recent “news” is fake and very monotonous…
— Naga Vamsi (@vamsi84) December 17, 2023
అలాగే ఇంకా ఆయన ఇలా పేర్కొన్నారు.. “ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వచ్చిన వార్తలు ఫేక్. అవి కేవలం గాసిప్స్. కొందరు కేవలం క్లిక్‌ల కోసం ఇలాంటి నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. మీరు దేనికి ప్రతిస్పందిస్తారో వారికి తెలుసు. అయితే ఇలాంటివాటిపై మేము నిశ్శబ్దంగా ఉన్నంతమాత్రాన వారు వ్యాప్తి చేస్తున్నది సరైనదని అర్థం కాదు!” అని కూడా నిర్మాత నాగవంశీ స్పష్టం చేశారు. కాగా మహేష్ బాబు ఈ చిత్రంలో ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో ‘గుంటూరు కారం’పై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక ఈ చిత్రాన్ని హారికా & హాసిని క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. నాగవంశీ, హారిక సూర్యదేవర సమర్పిస్తున్నారు. కాగా ఈ మూవీలో టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అలాగే జగపతిబాబు, జయరామ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా వచ్చే జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























