సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా వచ్చిన మోస్ట్ వయోలెంట్ మూవీ యానిమల్. కేవలం యాక్షన్ ను మాత్రమే కాదు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్ ను కూడా చాలా బాగా చూపించాడు. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి రెండు వారాలు పూర్తయిపోయినా కూడా ఈసినిమా కలెక్షన్స్ జోరు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. 15 రోజుల్లో ఈసినిమా 797 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతంచేసుకుంది. ఒక్క హిందీలోనే 480 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మరో వైపు తెలుగులో కూడా ఈసినిమా ఇప్పటికే మంచి కలెక్షన్స్ ను అందుకోవడమే కాకుండా లాభాలను సైతం తెచ్చిపెట్టింది. మరి ఈసినిమా 1000 కోట్ల క్లబ్ చేరాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
We are thrilled to announce that Animal film has grossed a staggering 797.6 crores Worldwide. Cinematic masterpiece 🙌. #RK @iamRashmika @thedeol @AnilKapoor @TSeries @tripti_dimri23 @imvangasandeep @VangaPranay @AAFilmsIndia @e4echennai @KvnProductions @SVC_official pic.twitter.com/FBvkchE6uW
— Bhadrakali Pictures (@VangaPictures) December 16, 2023
కాగా ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ నిర్మించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈసినిమా అమిత్ రాయ్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: