మాస్ రాజా రవితేజ ఈగల్ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి అయితే నిర్మాతలు రిలీజ్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు.సంక్రాంతికి సినిమా విడుదలవుతుందని తెలిపారు.ఇక ఈసినిమా తెలుగుతోపాటు హిందీలోకూడా విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిందీలో ఈసినిమాను సహదేవ్ గా విడుదలచేస్తున్నారు.హిందీ వెర్షన్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈసినిమాతో డైరెక్టర్ గా మారుతున్నాడు.స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా కావ్య థాపర్ ,మధుబాల,నవదీప్, కీలక పాత్రలో కనిపించనున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసినిమాను నిర్మిస్తుంది. జనవరి 13న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని ఎదురుకోనుంది.సంక్రాంతికి గుంటూరు కారం,హనుమాన్, సైంధవ్ ,నా సామి రంగ సినిమాలు కూడావిడుదలవుతున్నాయి.దాంతో ఈగల్ కు భారీ సవాల్ ఎదురుకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: