2024 నాలుగు సినిమాల రిలీజ్ ప్లాన్

vishwak sen about his upcoming releases

వెళ్ళి పోమాకే’ చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమై… ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ కి బాగా కనెక్ట్ అయి ‘ఫలక్‌నుమా దాస్’ చిత్రంతో తానే నటుడిగా.. దర్శకుడిగా పక్కా హైదరాబాదీ నేటివిటీతో సినిమాను తీసి.. తన బోల్డ్ నెస్ తో తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. నాని నిర్మాతగా రూపొందించిన ‘హిట్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి హిట్ కొట్టాడు. దీనితో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు విశ్వక్ సేన్. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నాడు. ఆతరువాత పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ధమ్కీ సినిమాలు చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా తన సోషల్ మీడియా ద్వారా తన సినిమాల గురించి.. రిలీజ్ ల గురించి ఆసక్తికర విషయాలు తెలియచేశారు. 2023 చివరి దశకు వచ్చేసింది. ఈ ఏడాది ఒక్క సినిమాను మాత్రమే రిలీజ్ చేశాను.. కానీ వచ్చే ఏడాది నాలుగు సినిమాలను రిలీజ్ చేయాలనే ప్లాన్ ఉంది. సెట్ లో ఉండటం అనేది నాకు థెరపీ లాంటిది.. ఇంకా చాలా మ్యూజిక్ బ్యాంక్ ఉంది.. వచ్చే ఏడాది గేమ్ ఛేంజింగ్ ఇయర్ అవుతుందని అనుకుంటున్నాను అంటూ తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

ప్రస్తుతం విశ్వక్ గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో బిజీగా ఉన్నాడు. విద్యాధర్ కాగిట దర్శకత్వంలో గామి సినిమా వస్తుంది. ఈసినిమాలో విశ్వక్ అఘోరా పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రానుంది. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఈరెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నాయి. వీటితో పాటు పలు సినిమాలు లైన్ లో ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =