హరీష్ శంకర్-రవితేజ మూవీ హీరోయిన్ ఫిక్స్

ravi teja and harish shankar new movie heroine fixed

వెండి తెరపై కొన్ని కాంబినషన్స్ చూడటానికి చాలా బావుంటాయి. అందుకే కొంతమంది డైరెక్టర్స్, హీరోస్ కానీ కాంబినేషన్స్ ను రిపీట్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ కాంబినేషన్ మరేదో కాదు రవితేజ-హరీష్ శంకర్ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ లో షాక్ ఇంకా మిరపకాయ్ సినిమాలు రాగా అందలో మిరపకాయ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇక ఇన్నేళ్ల తరువాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమాలో నటిస్తున్న హీరోయిన్ ను ప్రకటించారు. ఈసినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలియచేశారు.

కాగా ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు అయనంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.