సలార్ మిలియన్ దాటేసింది

salaar crossed million intrests on book my show

సలార్ మానియా స్టార్ట్ అయ్యింది.బుక్ మై షో లో ఇంట్రెస్ట్ 1.1మిలియన్ కు చేరుకుంది.మరోవైపు నార్త్ అమెరికా లో ప్రీ సేల్స్ మిలియన్ డాలర్ కు చేరుకున్నాయి.ఇక బెంగుళూరు,కేరళ లో కొన్ని చోట్ల  అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుంది.తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టికెట్ హైక్ కోసం సలార్ టీం దరఖాస్తు చేసుకున్నారు.ఈ విషయంలో క్లారిటీ రాగానే బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి.మరోవైపు తెలంగాణ లో స్పెషల్ షోస్ కి పర్మిషన్ వచ్చే అవకాశాలు వున్నాయి.ఓవరాల్ గా చూస్తే రిలీజ్ కు ముందు ఎలాంటి హైప్ కావాలో సలార్ కు అలాంటి హైప్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టాక్ కూడా పాజిటివ్ గానే వుంది.ఇండస్ట్రీ సర్కిల్ లో సినిమా చూసిన కొంత మంది అద్భుతంగా ఉందని అంటున్నారు.సో బాహుబలి 2తరువాత ప్రభాస్ ఎలాంటి విజయం కోసం ఎదురుచూస్తున్నాడో అలాంటి విజయం సలార్ ఇచ్చేలానే వుంది. ఫ్యాన్స్ కూడా ఈ తరహా సక్సెస్ కోసం ఎన్నో ఏళ్ళ నుండి ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ కు సౌత్ తోపాటు నార్త్ లోను భారీ క్రేజ్ వుంది.జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు 1000కోట్లు కొల్లగొట్టడం ఖాయం.మరో 6రోజుల్లో సలార్ థియేటర్లలోకి రానుంది.మరి ఈసినిమా అంచనాలను అందుకొని ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుందో లేదో చూడాలి.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈసినిమాలో శృతి హాసన్ హిరోయిన్ గా నటించగా రవి బసూర్ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.