మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా బాక్సాఫీస్ వద్ద యానిమల్ జోరు తగ్గడం లేదు.వర్కింగ్ డేస్ లో డీసెంట్ గా హోల్డ్ చేసిన ఈసినిమా వీకెండ్ లో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది దాంతో 17రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 835.9కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.నెట్ విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా నిన్నటి తో 460కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఫుల్ రన్ లో 500కోట్ల క్లబ్ లో చేరనుంది.అదే జరిగితే ఈఏడాది జవాన్,పఠాన్,గదర్ 2 తరువాత ఈ ఫీట్ సాధించిన నాలుగవ సినిమాగా యానిమల్ రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఓవరాల్ గా అయితే యానిమల్ ఫుల్ రన్ లో 900 కోట్ల గ్రాస్ వసూళ్ల దగ్గరే ఆగిపోయేలా వుంది కానీ 1000కోట్లు సాధ్యమయ్యేలా లేదు ఎందుకంటే ఈవారం సలార్,డంకి సినిమాలు విడుదలకానున్నాయి.ఈ రెండు భారీ సినిమాలు కావడంతో యానిమల్ స్లో అవ్వడం ఖాయం.ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే యానిమల్17రోజుల్లో 70కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.
అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించారు.హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించాడు.టి సిరీస్ ఈసినిమాను నిర్మించింది.ఇక ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.యానిమల్ పార్క్ అనే టైటిల్ తో సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: